ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Submitted on 5 September 2019
Heavy rains in AP, Telangana today, tomorrow

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని వున్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం, శక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు.

కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని విశాఖ వాతావారణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.  

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో బుధవారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే తెలంగాణలోని బెజ్టూరులో 6 సెంటిమీటర్ల అధికవర్షపాతం నమోదైంది. భీమిని, దహేగాం, వర్నిలలో 5 సెంటిమీటర్ల చొప్పున వర్షం పడింది. కాగజ్ నగర్, కోటగిరి, వంకిడిలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read : ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.30 లక్షలు వసూలు

HEAVY Rains
AP
Telangana
Today
tomorrow
Bay of Bengal
low pressure

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు