కక్కుర్తి కొంప ముంచింది : లంచం తిరిగి ఇచ్చి బుక్కైపోయిన తహశీల్దార్   

Submitted on 23 August 2019
 case of corruption Bachupalalli MR O Yadagiri Arrest

ఓ పని గురించి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చిన తరువాత ఆ పని అయినా..అవ్వకున్నా ఆ డబ్బు తిరిగి రానే రాదు. అది గోడకు వేసిన సున్నంతో సమానం తిరిగి వచ్చే ప్రసక్తే లేదు.కానీ ఓ అధికారి మాత్రం దీనికి పూర్తి డిఫరెంట్ గా వ్యవహరించాడు. దీంతో బుక్ అయిపోయాడు. ఓ పనిచేసేందుకు ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నాడు. పని అవ్వలేదు. కానీ తీసుకున్న లంచంలో కొంతమొత్తం తిరిగి ఇచ్చి ఇరుక్కుపోయాడు. ఆ విచిత్రమైన కేసు నిజాంపేట పరిధిలోని బాచుపల్లిలో చోటుచేసుకుంది. 

బాచుపల్లి రెవన్యూ ఆఫీస్ లో తహసీల్దార్ పనిచేస్తున్న నిమ్మ యాదగిరి లంచోదంతం ఇది. నిజాంపేట పరిధిలో బిల్డింగ్ కస్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. బిల్డర్‌ శ్రీనివాసరావు జులై 31న సర్వేయర్‌  ద్వారా రెవెన్యూ స్కెచ్‌ ఇవ్వాలని తహశీల్దార్ యాదగిరిని కోరాడు. అది ఇవ్వాలంటే రూ.లక్ష ఇవ్వాలంటు యాదగిరి డిమాండ్ చేశాడు. రెవెన్యూ ఆఫీసుల్లో పని అవ్వాలంటే ఇటువంటివి తప్పవు. దీంతో శ్రీనివాసరావు చేసేదేమీ లేక..రూ.లక్ష ఒక్కసారే ఇచ్చుకోలేనీ మొదటి విడతగా రూ50వేలు ఇచ్చాడు.

కానీ ఎంతకీ పని జరగలేదు. దీంతో పదే పదే తిరుగుతున్నా పని చేయటంలేదు అని గట్టిగా నిలదీశాడు శ్రీనివాసరావు.  యాదగిరి పని జరిగదు ఇక నీపని నువ్వు చూసుకో అంటూ సమాధానమిచ్చాడు. అయితే తాను ఇచ్చిన రూ.50వేలు తిరిగి ఇచ్చేయమని యాదగిరిని డిమాండ్‌ చేశాడు శ్రీనివాసరావు. దీంతో తహశీల్దార్ యాదగిరి ఆగస్టు 14న తన డ్రైవర్ మహ్మద్‌ అబ్దుల్‌ సయ్యద్‌ ద్వారా రూ.40 వేలను తిరిగి పంపారు. మిగతా రూ.10 వేలు ఖర్చుల కింద అయిపోయాయనీ చెప్పించాడు. పనీ చేయక..తిరిగి పూర్తి మొత్తాన్ని ఇవ్వకపోవటం..ఖర్చైపోయాయని చెప్పటంతో  శ్రీనివాసరావు మండింది. 


వెంటనే అవినీతి శాఖ అధికారులకు  శ్రీనివాసరావు తగిన ఆధారాలతో కంప్లైంట్ చేశాడు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినందుకు తహసీల్దారు యాదగిరితోపాటు ..డ్రైవర్‌ అబ్దుల్‌ సయ్యద్‌ను డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు గురువారం (ఆగస్టు 22)న తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చిన యాదగిరిని అరెస్ట్ చేశారు.అనంతరం ఆఫీస్ లో రాత్రి 7.30 గంటల వరకు సోదాలు నిర్వహించారు. 

యాదగిరి స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక. యాదగిరి సోదరి ఇంట్లో కూడా అధికారులు సీఐ భరత్‌కుమార్‌ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.  గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పనిచేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ఏవోగాను, తహసీల్దారుగా సదాశివపేట, పటాన్‌చెరులలో కూడా పనిచేసిన యాదగిరి..అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో పటాన్‌చెరు నుంచి బాచుపల్లికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. కాగా యాదగిరి గతంలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలలో పలుమార్లు ప్రశంసాపత్రాలు అందుకోవటం విశేషం. 

case of corruption
Bachupalalli
MRO
Yadagiri
Arrest

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు