బెంగాల్ వివాదం : రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Submitted on 15 May 2019
No election campaigning to be held in 9 parliamentary constituencies of West Bengal

ఢిల్లీ: పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. తుదివిడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం వరకూ గడువు ఉండగా..దానిని రేపటికే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ఎన్నికల సంఘం తొలిసారిగా ఆర్టికల్ 324ని వినియోగించినట్లు తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్లో  పోలింగ్ జరగనున్న9 పార్లమెంటరీ స్ధానాల్లో ప్రచారం 16వతేదీ రాత్రి 10 గంటలకల్లా ముగించాలని ఆదేశించింది. ఈనెల 19వ తేదీన జరిగే ఏడవ దశ పోలింగ్ లో పశ్చిమబెంగాల్ లోని 9  లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో డుం డుం, బరసత్‌, బసిర్హత్‌, జైనగర్‌, మధురాపూర్‌, జాదవ్‌ఫూర్‌, డైమండ్‌ హార్బర్ ‌, సౌత్‌ కోల్‌కతా, నార్త్‌ కోల్‌కతా  ఉన్నాయి. చివరిదశ పోలింగ్కు 17 వ తేదీ సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండగా పశ్చిమ బెంగాల్లో మాత్రం ఒకరోజు ముందు ప్రచారం ముగియనుంది.

election campaign
West Bengal
Banned
9 parliamentary constituencies
Election commission
elections 2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు