గెలుపుపై అనుమానాలు లేవు, 150కిపైగా సీట్లు ఖాయం : చంద్రబాబు ధీమా

Submitted on 15 April 2019
no doubts on tdp victory, cm chandrababu

ఢిల్లీ : ఓటమి భయంతోనే ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. టీడీపీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన అన్నారు. ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని, తెలుగుదేశం పార్టీ 150కిపైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.  పోలింగ్ రోజున ఓటర్ల నుంచి స్పందనే ఇందుకు నిదర్శనం అన్నారు. ఈవీఎంలపై పోరాటం చేస్తుంటే మేము ఓడిపోతామని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గెలుపు విషయంలో నేను భయపడటం ఏమిటి అని బాబు ప్రశ్నించారు. అసలు టీడీపీ ఎందుకు ఓడిపోతుందని చంద్రబాబు అడిగారు.
Read Also : టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం - డొక్కా

ఈవీఎంలపై ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నామని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రక్రియపై అందరికీ అవగాహన రావాలన్నారు. వీవీ ప్యాట్లు 50శాతం లెక్కించాలంటే ఈసీకున్న అభ్యంతరం ఏంటని చంద్రబాబు అడిగారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించడానికి ఈసీకున్న ఇబ్బంది ఏంటి అని నిలదీశారు. టీడీపీ పోరాట ఫలితంగానే వీవీ ప్యాట్ లు పెట్టారని చంద్రబాబు అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్లకు తేడా ఉన్నందునే లెక్కించాలని కోరుతున్నామని చెప్పారు.

ఈవీఎంల వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహించారని, శాంతి భద్రతల సమస్యలు సృష్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్చగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ ఫెయిల్ అయిందని చంద్రబాబు అన్నారు.
Read Also : 50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

AP CM chandrababu
TDP
win
ap elections
150 seats
evms
malfunction
tamepring

మరిన్ని వార్తలు