వస్త్రాపహరణకోసం వాడిన చీర 40 మంది కట్టుకోవచ్చు తెలుసా...

nkown-facts-about-br-chopras-mahabharat-draupadi-cheer-haran

దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిఆర్ చోప్రా ‘మహాభారత్’ లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోని నటులందరూ ఎంతో అంకితభావంతో పని చేశారు. అందుకు తగ్గట్టు మంచి పేరు వచ్చింది వారికి. ఈ సీరియల్‌‌లో ద్రౌపది వస్త్రాపహరణం సీన్ ఎంతో కీలకమైనది. ఈ కీలక ఘట్టమే మహాభారత యుద్ధానికి దారితీస్తుంది. అందుకే ఈ సన్నివేశం గురించి బిఆర్ చోప్రా పలురకాలుగా ఆలోచించారట.

ఈ నేపథ్యంలోనే ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశం కోసం 250 మీటర్ల చీరను తయారు చేశారు. సాధారణంగా ఒక చీర ఆరు మీటర్లు ఉంటుంది. ఆ లెక్కన దాదాపు 40 మంది కట్టుకునే చీర వాడారన్నమాట. అలాగే ఈ సీన్ చిత్రీకరణకు ప్రత్యేక సన్నాహాలు చేశారు దర్శకులు. ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగినపుడు శ్రీకృష్ణుడు కాపాడతాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ సన్నివేశంలో ద్రౌపది పాత్రను రూపా గంగూలీ పోషించారు. ఈ సీన్ షూటింగ్ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారట. అలానే ఈ దృశ్యాన్ని సింగిల్ టేక్‌లో చిత్రీకరించడం విశేషం. ‘Mahabharat’ ఇన్నాళ్ల తర్వాత టెలికాస్ట్ అవుతున్నా మంచి రేటింగ్‌తో దూసుకెళ్తుండడం విశేషం.

మరిన్ని తాజా వార్తలు