భీష్మ ప్రారంభమైంది

Submitted on 12 June 2019
Nithin's Bheeshma Movie Pooja Ceremony

నితిన్, రష్మిక జంటగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోయే భీష్మ (సింగిల్ ఫరెవర్) సినిమా పూజా కార్యాక్రమాలతో ప్రారంభమైంది. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నితిన్ తండ్రి, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మహతి సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. లై, చల్ మోహన రంగా, శ్రీనివాస కళ్యాణం వంటి వరస ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్‌.. భీష్మతో ట్రాక్‌లోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు. 

Nithin
Rashmika Mandanna
Sithara Entertainments
Venky Kudumula

మరిన్ని వార్తలు