ఇంకెప్పుడు తీసుకొస్తారయ్యా : నీరవ్ 4వ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Submitted on 12 June 2019
Nirav Modi Denied Bail Petition

PNB స్కామ్‌లో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ కొట్టివేయడం ఇది నాలుగోసారి. తాజాగా జరిగిన పరిణామంతో భారత్‌కు రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ముంబైలోని ఆర్దోర్ జైలులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని నకిలీ LOCలతో రూ. 12 వేల కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోడీ ప్రధాన సూత్రధారి. ఈ ఏడాది మార్చి 20న స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు ఇతడిని అరెస్ట్‌​ చేశారు. కస్టడీలో ఉన్న నీరవ్ మోడీ బెయిల్ ఇవ్వాలని కోర్టులో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

విచారణ ఎదుర్కొంటున్న మోడీని భారత్‌కు అప్పగించాలనే దానిపై బ్రిటన్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేసుకు సంబంధించిన దానిపై కీలక ఆధారాలను భారత ఈడీ, సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. లండన్ ప్రభుత్వం క్రాస్ ఎగ్జామినేషన్‌ను చేస్తోంది.

పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి వస్తుందని ముందే గ్రహించి దేశం వదిలి పారిపోయాడు నీరవ్. లండన్ లో విలాసవంత జీవితం గడుపుతూ గెటప్ మార్చి రోడ్లపై దర్జాగా తిరుగుతున్న నీరవ్ స్థానిక రిపోర్టర్ కంటపడ్డాడు. నీరవ్ ని గుర్తించిన ఆ జర్నలిస్ట్ అతని ప్రశ్నించాడు. కానీ నీరవ్ మాత్రం జవాబులు చెప్పలేదు. 

దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో భారత అధికారుల ఒత్తిడితో లండన్‌లోని హోల్‌బర్న్‌ మెట్రో స్టేషన్లో  తిరుగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దేశాలలో నీరవ్‌ మోడీకి చెందిన రూ.1,725.36 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే నీరవ్ భారత్ కు ఎప్పుడు అప్పగిస్తారో చూడాలి. 

NIRAV MODI
Denied
bail petition
PNB Fraud
UK court denies

మరిన్ని వార్తలు