వాటే బ్యాలెన్స్ బుడ్డోడా : సింగిల్ వీల్‌పై సూపర్ ఫీట్..అద్దిరిపోయింది

Submitted on 16 September 2019
Nigerian Boy Super feat on single wheel bicycle

టాలెంట్ ఎవరి సొంతమూ కాదనీ నిరూపిస్తున్నాడు ఓ నైజీరియా పిలగాడు. ఈ బాలుడి ఫీట్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సింగిల్ వీల్ సైకిల్..పాదంపై పింగాణీ బౌల్స్. వాటిని ఎగురవేసి తలపై పడేలా పట్టుకుంటున్నాడు. అది కూడా ఒక్క బౌల్  కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్ గా గోల్ కొట్టినట్లుగా పడేశాడు. 

రెండు చక్రాల సైకిల్ తొక్కటం ఈజీనే. కానీ ఒక్క చక్రం సైకిల్ ని తొక్కటం అంత ఈజీ కాదు. దానిపై ఎక్కి.. కదలకుండా ఒక్కచోటే నిలబెట్టటం..పైగా దానిపై ఫీట్స్ వాహ్..బుడ్డోడా అనిపించకమానదు ఈ పిలగాడి ఫీట్స్ చూస్తే. వీడి టాలెంట్ చూసి ఆశ్యర్యపోని వారు..అభినందించనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

నైజీరియాలోని జీకేబీ యూనిసైకిల్‌ అకాడమీ విద్యార్థి తన విన్యాసంతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. యూనిసైకిల్‌ అంటే ఒక చక్రంతో నడిచే సైకిల్ ని బ్యాలెన్స్‌ చేయటం ఒక ఎత్తైతే..దానిపై బ్యాలెన్స్‌ చేస్తూ తన పాదం పైనున్న నాలుగు గిన్నెల్ని నెత్తిపై ఒకదానిపై పేర్చినట్లుగా ఎగరేశాడు. ఈ క్రమంలో తన బ్యాలెన్స్ నేు ఏమాత్రం తప్పలేదు. ఈ వీడియోను ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ గార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ట్యాలెంటెడ్‌ బాలుడి విన్యాసాన్ని మెచ్చుకోకుండా ఉండలేమని క్యాప్షన్‌ కూడా పెట్టింది. 

Nigerian Boy
Super feat
single wheel bicycle

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు