కివీస్ టార్గెట్ 242

Submitted on 19 June 2019
http://www.10tv.in/new-zealand-vs-south-africa-kiwis-target-242-15339

దక్షిణాఫ్రికా జట్టు పరువు నిలబెట్టుకుంది. పేలవంగా ముగిస్తుందనుకున్న ఇన్నింగ్స్‌ను ఓ మాదిరి స్కోరు చేసి ఒడ్డుకు చేరింది. వర్షం కారణంగా 49ఓవర్లకు కుదించడంతో తటపటాయిస్తూ ఆరంభించిన సఫారీలు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6వికెట్లు నష్టపోయి కివీస్‌కు 242పరుగుల టార్గెట్ నిర్దేశించారు. 

దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా దిగిన స్టార్ ప్లేయర్ డికాక్ కేవలం 5పరుగులకే పరిమితమై వెనుదిరిగాడు. మరో ఓపెనర్ హషీమ్ ఆమ్లా(55: 83బంతుల్లో 4ఫోర్లు)తో డుప్లెసిస్(23)తో జతకలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరి జోడికి ఫెర్గ్యూసన్ బ్రేక్ వేయడంతో 2వ వికెట్‌గా డుప్లెసిస్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కరమ్(38)తో కలిసి కాసేపటి వరకూ ఆడిన ఆమ్లా 111పరుగుల వద్ద వెనుదిరిగాడు. 

ఆఈ క్రమంలో మార్కరమ్‌తో పాటు డస్సెన్(67)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఓ ఐదు ఓవర్ల విరామానికి డేవిడ్ మిల్లర్(36)వికెట్ పడగొట్టడంతో దక్షిణాఫ్రికా స్కోరుకు కళ్లెం పడింది. చివరి వికెట్ ఫెలుక్వాయో(0) అవుట్ అవడంతో క్రీజులో డస్సెన్, క్రిస్ మోరిస్(6)లతో ఇన్నింగ్స్ ముగించారు.  

కివీస్ బౌలర్లు ఫెర్గ్యూసన్(3)వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్ హోమ్, శాంతర్ తలో వికెట్ పడగొట్టారు. 

new zealand
South Africa
Kiwis
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు