డిగ్రీ నాలుగేళ్లు... బీటెక్‌ ఐదేళ్లు : ఈజీగా ఉద్యోగాలు వచ్చేందుకు కొత్త ప్రయత్నం

Submitted on 30 November 2019
new education courses in ap

ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలని చూస్తోంది. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ లెక్కన ఏపీలో 2020 నుంచి డిగ్రీ నాలుగేళ్లు, ఇంజినీరింగ్ ఐదేళ్లు కానుంది. డిగ్రీ మూడేళ్లు, ఇంజినీరింగ్ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఒక ఏడాది అప్రెంటిస్ షిప్ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యా మండలి తీసుకురానుంది. చదువు పూర్తయిన తర్వాత చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. కారణం స్కిల్స్ లేకపోవడమే. దాంతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు పొందేలా తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ అర్హతలు, అందుకు కావల్సిన నైపుణ్యాలు కల్పించే దిశగా ఉన్నత విద్యామండలి అడుగులు వేస్తోంది. ఇందుకోసం 2020 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలు నాలుగేళ్లు.. ఇంజినీరింగ్‌ ఐదేళ్ల కోర్సులు కానున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కంప్లీట్ అయ్యాక తప్పనిసరిగా ఏడాది అప్రెంటిస్‌షిప్‌ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యాశాఖ తీసుకురాబోతోంది. ప్రస్తుతం డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన చాలా మందికి స్కిల్స్ లేక ఉద్యోగాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువులను ఉపాధి, ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. త్వరలో విధివిధానాలను విడుదల చేయనుందని తెలుస్తోంది.

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేవారికే ఇవి వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. డిగ్రీ విద్యార్థులకు ఫస్ట్, సెకండియర్ లో జీవన నైపుణ్యం (లైఫ్‌ స్కిల్స్‌) కోర్సులు ఉంటాయి. చివరి ఏడాది ఆరో సెమిస్టర్‌లో నైపుణ్య కోర్సులను చదవాలి. నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఈ కోర్సులను అమలు చేయనున్నారు.

* అప్రెంటిస్‌షిప్‌ చేసే ఏడాది సమయంలో విద్యార్థులకు బోధన రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుంది. 
* వసతి, భోజనానికి రూ.20వేలు అదనంగా ఇస్తారు. 
* అప్రెంటిస్‌షిప్‌ సమయంలో కంపెనీలు ఉపకారవేతనాలిస్తే మాత్రం.. ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయదు. 
* విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. 
* బోధన రుసుములు, వసతి, భోజనం డబ్బును విద్యార్థి బ్యాంకు అకౌంట్ లో జమ

new education
courses
Degree
btech
five years
AP
apprentice ship
Students
jobs

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు