గంట వినిపిస్తోంది : క్లాక్ టవర్స్ పని చేస్తున్నాయి 

Submitted on 22 January 2019
New concepts to history: GHMC actions to clock tower development in hyderabad

చరిత్రకు నిలయం హైదరాబాద్. సిటీలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రతీ చోటా చారిత్రక ఆనగాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. జంట నగరాల్లో ప్రధాన ఆకర్షణ క్లాక్ టవర్స్. చాలా కాలంగా ఇవి పనిచేయటం లేదు. వీటిని బాగుచేయిస్తోంది GHMC. ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది.

హైదరాబాద్ సిటీలో మొత్తం 12 క్లాక్ టవర్స్ ఉన్నాయి. మోజాంజాహి మార్కెట్, షా అలీ బాండ, ముర్కి చౌక్, సుల్తాన్ బజార్లలోని టవర్లను GHMC నిర్వహిస్తోంది. గార్డ్రో కేఫ్ జంక్షన్, సికింద్రాబాద్, మోజాంజహీ మార్కెట్, ముర్కి చౌక్ వంటి ప్రాంతాలలో ఉన్న క్లాక్ టవర్స్ చాలా కాలం నుండి పనిచేస్తున్నాయి.
 

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో మరియు రాష్ట్రం అంతటా వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణ మరియు మరమ్మత్తు పనులలో భాగంగా ప్లానింగ్ తో GHMC క్లాక్ టవర్స్  స్థితి..గతులకు సంబంధించి ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో నిర్మాణాత్మకత..గడియారాల టెక్నాలజీ పరిజ్ఞానం, వాటి పునరుద్ధరించడానికి తీసుకునే చర్యలు వంటి పలు కీలక అంశాలు ఉన్నాయని జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వర్కింగ్ ప్లానింగ్ లో ఈ నిర్మాణాలు లైటింగ్, గార్డెనింగ్, సెక్యూరిటీ / ఫెన్సింగ్, క్లీనింగ్ వంటి పలు వర్క్ లతో డెకరేట్ చేయబడతాయి. తెలంగాణ రిజర్వ్ పోలీస్ నుంచి సెక్యూరిటీ శాఖ, భద్రతా, భద్రత కోసం ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు.

మొజాంజాయి మార్కెట్ మరియు షా అలీ బాండ వంటి ప్రదేశాలలో, పావురాలు సాధారణంగా గడియారాల టవర్స్ పైనే ఆవాసాలు ఏర్పరచుకుంటున్నాయి. దీంతో వాటి పనితీరు కాస్తంత దెబ్బతినటంతో కొంచెం స్లో అయినట్టుగా తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం మొజాంజహి మార్కెట్లో ఉన్న టవర్స్ లో పావురాలు..ఇతర పక్షులు టవర్ లోపలికి వెళ్లకుండా Mercury Circle (పాదరసాల వలయం)న్ని GHMC ఏర్పాటు చేసింది. దీంతో కొంతవరకూ సమస్య పరిష్కారం చేయగలిగారు. ఈ క్రమంలో నగరంలో క్లాక్ టవర్స్ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు..వాటిని మరింతగా సుందరంగా తీర్చి దిద్దేందుకు GHMC చర్యలు తీసుకుంటోంది.

Telangana
Hyderabad
Aravind Kumar of the Municipal Administration and Urban Development PrincipleClock Towers
GHMC
Working
Decoration

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు