నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్‌ ఇదే

Submitted on 15 March 2019
Nellore District TDP First List

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆచితూచి అభ్యర్ధులను సెలెక్ట్ చేశారు చంద్రబాబు. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లను దక్కించుకున్న తెలుగుదేశం ఈసారి పట్టు సాధించేందుకు గట్టి అభ్యర్ధును నిలబెట్టింది. రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ ఉండే జిల్లా కావడంతో జగన్‌ను ఢీకొట్టాలంటే ఆర్థికంగానూ, జనబలంలోనూ గట్టిగా ఉండే అభ్యర్ధులను ప్రకటించవలసిన పరిస్థితి ఉంది.
Read Also: ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!

ఈ క్రమంలో ఏడు నియోజకవర్గాల సీట్లను చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు గాను.. ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరుకు అభ్యర్థులను ప్రకటించారు. కావలి, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరి స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేదు.

గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉదయగిరి.. బొల్లినేని రామారావు, వెంకటగిరి.. కురుగొండ్ల రామకృష్ణలకు చంద్రబాబు సీట్లను ఖరారు చేయకపోవడంతో వారికి ఈ దఫా సీట్లు రావేమో అనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఇక కావలి రాజకీయం రసవత్తరంగా ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బీద మస్తాన్ రావును నెల్లూరు పార్లమెంట్‌‌కు పంపే యోచనలో ఉన్న చంద్రబాబు కావలి టిక్కెట్‌ను వేరే ఒకరికి కేటాయించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
ఓసీలు- 05
ఎస్సీలు-01

నెల్లూరు జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:
ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య 
కొవూరు – పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు(సిటీ) – పొంగనూరు నారాయణ 
నెల్లూరు(రూరల్‌) – ఆదాల ప్రభాకర్ రెడ్డి
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 
గూడూరు – పాశం సునీల్‌ 

ఖరారు కాని స్థానాలు:
కావలి
ఉదయగిరి
వెంకటగిరి
సూళ్లూరుపేట
Read Also: నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్‌ ఇదే

Nellore
TDP
Kavali
Chandrababu Naidu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు