ఆస్తి కోసమే రోహిత్ ని అపూర్వ హత్య చేసింది

Submitted on 24 April 2019
ND Tiwari's Son Was Drunk, Couldn't Fight Back Wife Who Killed Him: Delhi Cops

ఢిల్లీ:  వైవాహిక జీవితంలో కలతలు, ఆస్తి పంపకాల్లో విభేదాల కారణంగానే రోహిత్ శేఖర్ తివారీని అతని భార్య అపూర్వ శుక్లా హత్య చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత ఎన్డీ తివారీ కోడలు అపూర్వ తివారీని పోలీసులు అరెస్టు చేశారు. తివారీ కుమారుడు, రోహిత్‌ శేఖర్‌ తివారీ హత్య కేసులో అపూర్వ తివారీని బుధవారం (ఏప్రిల్ 24,2019) అరెస్ట్ చేశారు. శేఖర్ తివారీ (40) గత మంగళవారం ఏప్రిల్ 16న అనుమానాస్పద స్దితిలో హత్యకు గురయ్యారు. 

కేసును నమోదు చేసుకున్న పోలీసులు..పోస్టుమార్టమ్ రిపోర్టులో హత్యేనని తేలడంతో విచారణను వేగవంతం చేశారు. దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్‌ఫర్ ‌చేశారు. శేఖర్ ది సహజ మరణం కాదని, దిండును ముఖంపై నొక్కిపెట్టడంతో ఊపిరాడక మృతి చెందాడని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రోహిత్ ను భార్య అపూర్వ చంపిందని, వారి వైవాహిక జీవితం సంతోషంగా లేదని రోహిత్ తల్లి ఉజ్వల తివారీ ఆరోపించారు. శేఖర్ భార్య అపూర్వను 3 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 
Also Read : వేలంలో నన్నేవరూ కొనరు : అదో ట్రేడ్ సీక్రెట్.. CSK సక్సెస్ మంత్రా చెప్పను

రోహిత్ మరణించిన రోజు రాత్రి అతని గదిలోనే తాను ఉన్నట్లు అపూర్వ పోలీసు విచారణలో చెప్పింది. తాను తన భర్తతో ఆనందంగా లేనని, గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య  గొడవలు జరుగుతున్నట్లు వివరించింది. హత్య జరిగిన రోజు రోహిత్ మద్యం సేవించి వచ్చాడని, హత్యకు ఆమె ఎవరి సహాయం తీసుకోలేదని పోలీసులు తెలిపారు. దిండు ముఖంపై నొక్కి పెట్టి ఉంచటంతో, మద్యం సేవించిన రోహిత్ ప్రతిఘటించలేక పోయాడని  పోలీసులు తెలిపారు.  భార్య, భర్తల మధ్య ఆస్తి పంపంకం విషయంలో గొడవలున్నాయి.

సుప్రీం కోర్టు సమీపంలోని తిలక్ రోడ్డులో ఉన్న ఆస్తులు తన పేర రాయాలని అపూర్వ  పట్టుబట్టింది. ఎన్డీ తివారీ ఉత్తరాఖండ్‌ సీఎంగా పనిచేసిన  రోజుల్లో ఆయనకు చేదోడువాదోడుగా ఉన్న రాజీవ్‌ కొడుకు కార్తిక్‌ రాజ్‌కు అందులో వాటా ఇవ్వాలని తివారీ  పెద్ద కుమారుడు సిద్ధార్థ్‌, రోహిత్‌  అనుకున్నారు. దీన్ని అపూర్వ వ్యతిరేకించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రోహిత్‌, అపూర్వ ఈ ఏడాది జూన్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్నారని రోహిత్ తల్లి ఉజ్వల తెలిపారు. అపూర్వే ఆస్తి కోసం తన కొడుకును హత్య చేసిందని ఉజ్వల ఫిర్యాదుచేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి అపూర్వ నుంచి నిజం రాబట్టారు. 
Also Read : ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్

ND Tiwari
Rohit Shekhar Tiwari
Apoorva Shukla
murder
crime
Ujjwala Tiwari
Rohit Sekhar Murder Case

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు