సినిమాను ఆపండి - మద్రాస్ హైకోర్టు ఆదేశం

Submitted on 12 June 2019
Nayanthara's Kolaiyuthir Kaalam film in Trouble

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'కోలైయుతీర్ కలాం' సినిమా విడుదల నిలిచిపోయింది. బిల్లా 2 ఫేమ్ చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భూమిక ఇంపార్టెంట్ రోల్ చేసింది. థ్రిల్లర్ స్టోరీగా ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, జూన్ 14న విడుదల కావాల్సిన కోలైయుతీర్ కలాం సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది..

ప్రముఖ తమిళ రచయిత సుజాతా రంగరాజన్ కోలైయుతీర్ కలాం నవల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలిసింది. ఈ నవల రైట్స్‌ను రూ.10 లక్షలు పెట్టి సుజాతా రంగరాజన్ భార్య నుండి తాను కొనుగోలు చేసానని, ఇది కాపీ రైట్స్‌ను ఉల్లంఘించడమని, నిర్మాతలు సినిమాను విడుదల చెయ్యకుండా చూడాలని దర్శకుడు బాలాజీ కుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసారు.

మంగళవారం బాలాజీ కుమార్ పిటిషన్‌‌ను పరిశీలించిన కోర్టు కోలైయుతీర్ కలాం సినిమా విడుదలపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.. జూన్ 21న చిత్ర నిర్మాతలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.. ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడి తదితరులు నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

Nayanthara
Bhoomika Chawla
Chakri Toleti

మరిన్ని వార్తలు