విశాఖ నేవీ దెబ్బకు జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది

Submitted on 22 February 2020
Navy's objection to the capital at Vishakha Millennium Tower has become CM Jagan silent: bonda Uma

విశాఖపట్నంలో  రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్‌ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విశాఖ నేవీ తీవ్ర అభ్యంతర వ్యక్తంచేసందనీ..మిలీనియం టవర్ లో సచివాలయం వద్దని నేవీ తేల్చి చెప్పిందని దీంతో  ఏం చేయాలో తెలీక సీఎం జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందని బోండా ఉమ విమర్శించారు. 

మూడు రాజధానులంటూ ముందుకెళుతున్న జగన్ ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ.కోటి అయినా ఖర్చుపెట్టారా? అసలు అభివృద్దిపనులపై దృష్టి పెట్టారా? అని బోండా ఉమ ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయంపై మంత్రి వర్గ ఉప సంఘ కొడని తవ్వి కనీసం ఎలుక తోకను కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు బోండా ఉమ.  

అధికారంలోకి వచ్చాక ఎటువంటి అభివృద్ధి పనులపైనా దృష్టి పెట్టకుండా పిచ్చి పిచ్చి నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధిని  కుంటుపడేలా చేస్తున్నారనీ..దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి మూడు రాజధానులంటూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విమర్వించారు బోండా ఉమ.

Vishakhapatnam Millennium Tower
capital
Navy's objection
has become CM Jagan government
silent
TDP
bonda uma
Criticisms

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు