అడుగడుగో యాక్షన్ హీరో.. రూలర్.. సాంగ్ వచ్చేసింది

Submitted on 1 December 2019
Nandamuri Balakrishna's Adugadugo Lyrical Video from Ruler Movie

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వస్తోన్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ‘రూలర్’. సీనియర్ దర్శకుడు కె.యస్.రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేదిక, సోనాలి చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్.

డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా.. అడుగడుగో యాక్షన్ హీరో అంటూ సాగే సాంగ్‌లో బాలయ్య స్టిల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వెయిట్ ఉన్న పాత్రలను ఎంచుకొని, నట విశ్వరూపాన్ని చూపే బాలయ్య.. ఈ సాంగ్‌లో యంగ్ హీరోలా చాలా కొత్తగా కనిపించాడు. బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పాటను షేర్ చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. పరుచూరి మురళి కథ అందించారు. సి.రాం ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. డిసెంబర్ 15వ తేదీన ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. 
 

Adugadugo Lyrical Video
Nandamuri Balakrishna
Sonal Chauhan
Chirantann Bhatt
C Kalyan
Ruler Movie

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు