నమో ప్రారంభమైంది...నమో టీవీ కనబడుట లేదు

Submitted on 20 May 2019
NaMo on, NaMo TV gone: Channel disappears from all platforms as Lok Sabha election ends

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఆదివారం(మే-19,2019)తో ముగిశాయి.దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయేదే విజయంగా తేలింది. దీంతో ఇప్పుడు దేశంలో నమో పేరు మాత్రమే మినిపిస్తోంది.అయితే కొన్ని రోజుల క్రితం బీజేపీ హడావుడిగా ప్రారంభించిన నమో టీవీ మాత్రం ఇప్పుడు ఎక్కడా కన్పించడం లేదు.వ్యూయర్స్ ల సెట్ టాప్ బాక్స్ ల నుంచి నమో టీవీ కన్పించకుండా పోయింది.అయితే ఎన్నికలు ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు ప్రారంభమై ఎన్నికలు ముగిసిన వెంటనే  నమో టీవీ కన్పించకుండా పోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


బీజేపీ ఫండింగ్ తో స్టార్ట్ అయిన నమో టీవీ ఎన్నికల సమయంలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నమో టీవీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లెయింట్ చేసిన విషయం తెలిసిందే.కొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా నమో టీవీపై చర్చ కూడా జరిగింది. కేవలం మోడీ ఇంటర్వ్యూలు,ర్యాలీలు,ప్రభుత్వ పథకాలు,ఇతర బీజేపీ నాయకుల ఇంటర్వ్యూలు మాత్రమే ప్రసారం చేస్తున్నారంటూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ముందుగా సర్టిఫై చేసిన ప్రోగ్రామ్స్ ను  మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన తర్వాత తమ సర్టిఫికేషన్ లేకుండా బీజేపీ నమో టీవీలో ఎటువంటి కంటెంట్ ను ప్రసారం చేయకూడదని ఢిల్లీ సీఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.టాటా స్కై,వీడియో కాన్,డిష్ టీవీ వంటి డీటీహెచ్ ఆపరేటర్లు నమో టీవీని ఫ్రీ టూ ఎయిర్స్ సర్వీస్ కింద ప్రసారం చేశాయి.ఈ చానల్ ను చూసేందుకు సబ్ స్కైబర్లు డబ్బులు చెల్లించనవసరం లేదు.2019 లోక్ సభ ఎన్నికలు జరినంత సేపు దేశవ్యాప్తంగా ఈ చానల్ కన్పింది.అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ చానల్ కన్పించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


 

NaMo on
Namo Tv
gone
Channel
disappears
all platforms
Lok Sabha Election
ends

మరిన్ని వార్తలు