లతాజీ రిక్వెస్ట్ : ధోనీ..రిటైర్మెంట్ ఆలోచన వద్దు

Submitted on 11 July 2019
Namaskar M S Dhoni | Legend Singer Lata Mangeshkar Tweet

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ చేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 2019 ప్రపంచ వరల్డ్ కప్‌లో సెమీస్‌లో భారత్ ఓడిపోయేసరికి..ధోనీ రిటైర్ మెంట్‌పై వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పటికే చాలా మంది స్పందించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్..ధోనీపై ప్రశంసలు కురిపించారు. రిటైర్మెంట్ వ్యక్తిగతమన్నారు. లెజండరీ గాయని లతా మంగేష్కర్ రెస్పాండ్ అయ్యారు.

2019, జూలై 11వ తేదీన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటారనే వార్తలు వింటున్నానని, ఇలా ఆలోచించవద్దని కోరారు. దేశానికి మీలాంటి క్రీడాకారులు అవసరమని...రిటైర్ మెంట్ విషయంపై ఆలోచించకూడదని వేడుకుంటున్నానని లతా తెలిపారు. 

2019 ప్రపంచకప్‌లో విజయం సాధించిన తర్వాత..అంతర్జాతీయ క్రికెట్‌కు మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ గుడ్‌బై చెబుతాడని ప్రచారం జరిగింది. 2019, జులై 10వ తేదీ బుధవారం నాడు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 18పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. టార్గెట్ రీచ్ అవ్వడానికి కొన్ని పరుగులు మాత్రమే ఉండగా వ్యక్తిగత స్కోరు 50 వద్ద ధోనీ రన్ అవుట్‌ అయ్యాడు. పెవిలియన్ చేరే సమయంలో ధోనీ భావోద్వేగానికి గురైనట్లు స్పష్టంగా కనిపించింది. రిటైర్‌మెంట్ విషయంలో ఇంతవరకు ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Namaskar
M S Dhoni
Legend Singer
Lata Mangeshkar Tweet


మరిన్ని వార్తలు