టీడీపీకి గుడ్‌ బై : కాంగ్రెస్‌లోకి నామా

Submitted on 14 March 2019
Nama Nageswara To Join Congress Party

ఖమ్మం: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్, కీలక నేత నామా నాగేశ్వరరావు.. ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో నామా టీడీపీని వీడటం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ లో చేరతారని, ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం.

నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లోకి వెళతారని వార్తలు వచ్చాయి. అయితే టీఆర్ఎస్ లో రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన పొంగులేటి సుధాకర్ రెడ్డికి.. రెండోసారి ఎంపీ సీటు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా లేరని సమాచారం. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. అలాంటి పరిస్థితి తనకు రాకూడదని భావించిన నామా.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.. కాంగ్రెస్ లో అయితే రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండదని, ఎంపీగా గెలవొచ్చని భావించిన నామా.. ఆ పార్టీలో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో నామా మాత్రం.. టీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ఎన్నికల వేళ ఖమ్మం జిల్లా రాజకీయాలు రంజుగా మారాయి.

nama nageswara rao
TDP
Telangana
Congress
Khammam
TRS
tdp polit bureau meeting
Chandrababu

మరిన్ని వార్తలు