సమ్మర్ టూర్ కష్టాలు : సిమ్లా, మనాలి రావొద్దు.. చార్ థామ్ యాత్రకి పోటెత్తిన భక్తులు

Submitted on 11 June 2019
Nainital, Mussoorie, Shimla and Manali are witnessing a huge influx of tourists

సమ్మర్ అంటేనే.. ఉత్తర భారతం గుర్తుకొస్తుంది. మండే వేసవి నుంచి రిలాక్స్ కోసం సిమ్లా, మనాలీ వెళుతుంటారు. దీనికితోడు మే 7వ తేదీన ప్రారంభం అయిన చార్ థామ్ యాత్రతో టూరిస్టుల సంఖ్యలో ఒక్కసారిగా పెరిగిపోయింది. సమ్మర్ హాలిడేస్ ముగుస్తుండటంతో ఒకేసారి లక్షల సంఖ్యలో ఆయా ప్రాంతాలకు వెళ్లారు. దీంతో అన్నీ కష్టాలే.

- ఉత్తరాఘండ్ రాష్ట్రంలోని గంగోత్రి, యమునోత్రి, కేథార్ నాథ్, బద్రీనాథ్ దేవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. 
- ఈ 4 ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజుల్లోనే 15 లక్షల మంది టూరిస్టులు వచ్చారు.
- 8వేల మందికి ఒకేసారి వసతి కల్పించే అవకాశం మాత్రమే ఉంది. అయితే ఒక్కసారిగా లక్షల మంది రావటంతో వసతి లేక ఇబ్బంది పడ్డారు.
- నైనిటాల్, ముస్సోరిలో అయితే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పడుకుంటున్నారు యాత్రికులు.
- ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఏర్పడింది
- ట్రావెల్ ఏజెన్సీలు బుకింగ్స్ నిలిపివేశాయి

- నైనిటాల్ కు ఆదివారం ఒక్క రోజే 1,500 టూరిస్ట్ వెహికల్స్ వచ్చాయి. పార్కింగ్ సమస్య తలెత్తింది
- ఈ ప్రాంతాల్లో 5 - 6 గంటలు ట్రాఫిక్ జాం అవుతుంది.
- ఇక సిమ్లా, మనాలీ అయితే కిటకిటలాడుతోంది.
- సిమ్లాలో 4వేల 500, మలానీకి 5వేల టూరిస్ట్ వెహికల్స్ వస్తున్నాయి. వారం రోజులుగా ప్రతి రోజూ ఇదే పరిస్థితి.
- ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ సమస్య, వసతులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. తాత్కాలిక వసతి ఏర్పాటు చేయటానికి ఇబ్బందులు ఉండటంతో.. ప్రస్తుతానికి ఎవరూ రావొద్దని సిమ్లా అధికారులు అంటున్నారు.
- సిమ్లా, మనాలీలో ఈ రద్దీ మరో వారం, 10 రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు
- ఈ రెండు ప్రాంతాలకు బుకింగ్స్ కూడా క్లోజ్ చేశాయి ట్రావెల్ ఏజెన్సీలు

సమ్మర్ హాలీడేస్ పూర్తవుతుండటంతో భక్తులు, యాత్రికుల సంఖ్య ఆయా ప్రాంతాలకు పెరుగుతుంది. ఇక గుళ్లు, గోపురాల్లో దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుంది.

Nainital
Mussoorie
Shimla
Manali
tourists
Parking
Food
Hotels

మరిన్ని వార్తలు