లేడీ డైరెక్టర్‌తో నాగశౌర్య

Submitted on 19 September 2019
Naga Shaurya next with Debut Director

ఇటీవలే 'ఓ బేబి' మూవీతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం తన సొంత నిర్మాణ సంస్థలో రూపొందుతున్న 'అశ్వథ్థామ' షూటింగులో గాయపడిన నాగ శౌర్య తిరిగి షూట్‌లో పాల్గొంటున్నాడు. రీసెంట్‌గా నాగ శౌర్య కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నౌగ శౌర్య తన తర్వాతి సినిమా చెయ్యనున్నాడు. ప్రొడక్షన్ నెం : 8గా తెరకెక్కబోయే ఈ సినిమా ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతుంది.

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో సుదీర్ఘ అనుభవమున్న సౌజన్య.. నాగ శౌర్యతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చెయ్యనుందని తెలుస్తుంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది.

 

Naga Shaurya
Sithara Entertainments
Lakshmi Sowjanya

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు