వాడు పరమ నీచుడు : ATM సెంటర్ లో బరితెగించాడు

Submitted on 13 May 2019
Mumbai Man Flashed Woman Inside An ATM

వాడు చేసిన పనికి దేశం మొత్తం నివ్వెరపోయింది.. ఆ ఆడపిల్ల విషయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన ఆ మనిషి.. నిస్సిగ్గుగా, బరితెగించి చేసిన పని షాక్‌కు గురి చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఈ ఘోరం కలకలం రేపుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సంచలనంగా మారింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. సందీప్ కుంభార్కర్ అనే వ్యక్తి అర్థరాత్రి ఆటోలో ప్రయాణిస్తున్నాడు. మధ్యలో ఓ అమ్మాయి ఆటో రిక్షా ఎక్కింది. అర్థరాత్రి కావటం.. ఇద్దరే ఉండటంతో అమ్మాయితో చనువుగా వ్యవహరించటానికి ప్రయత్నించాడు సందీప్. అనుమానం వచ్చిందో ఏమో గానీ.. ఆ అమ్మాయి ముంబైలోని హరి ఓం నగర్ రోడ్డులో దిగింది. చేతిలో డబ్బులు లేవని.. దగ్గరలోని ATM సెంటర్ లోకి వెళ్లింది. ఇదే అదునుగా సందీప్ కూడా ఆ అమ్మాయి వెంట వెళ్లాడు. 

ఆ అమ్మాయి అకౌంట్ నుంచి డబ్బులు రావటం లేదు. దీన్ని గమనించిన సందీప్.. నేను డబ్బులు డ్రా చేసి ఇస్తాను అంటూ ఆమె వెనకే ATM సెంటర్ లోకి వెళ్లాడు. వాడి వెనుక భాగాన్ని అమ్మాయికి రుద్దడం మొదలుపెట్టాడు. డబ్బులు కావాలంటే నేను చెప్పిన పని చేయాలంటూ కండీషన్ పెట్టాడు. షాక్ అయ్యింది ఆ అమ్మాయి. ఇది ATM సెంటర్.. నువ్వే ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని ప్రశ్నించింది. 

ఇవన్నీ పట్టించుకోని సందీప్.. ఏకంగా ఏటీఎం సెంటర్ లోనే ప్యాంట్ విప్పేశాడు. తన ప్రైవేట్ పార్టులను కూడా బయటకు తీసి.. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను చెప్పిన పని చేస్తేనే.. డబ్బులు ఇస్తా.. అర్థరాత్రి ఎక్కడికి.. ఎలా వెళ్తావ్ అంటూ బెదిరించటం మొదలుపెట్టాడు. ఈ ఘటన మొత్తాన్ని ఆ అమ్మాయి తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించింది. రికార్డు చేస్తున్న విషయాన్ని గమనించి ఏటీఎం సెంటర్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. 

వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారు కిలోమీటర్ దూరం వరకూ వెంటాడి పట్టుకున్నారు. పలు కేసుల కింద అరెస్ట్ చూపించారు. ఏటీఎం సెంటర్‌లో ఈ నీచుడు చేసిన పనిని ఆ అమ్మాయి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వైరల్ అయిపోయింది. వాడిని కఠినంగా శిక్షించాలని.. ఏటీఎం సెంటర్ లో అర్థరాత్రులు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యం, ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Mumbai
ATM
harrasement

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు