కూలిన ఫుట్ ఓవర్‌ బ్రిడ్జి : ఒకరు మృతి

Submitted on 14 March 2019
Mumbai CST bridge collapse

ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్‌ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం(మార్చి 14) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also : ముఖ్యమంత్రి పదవిపై కోరిక లేదు : పవన్ కళ్యాణ్

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.  సాయంత్రం వేళ బాగా రద్దీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించింది.

CSMT ప్లాట్‌ఫాం 1కు దారితీసే వంతెన కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారి సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Read Also : ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?

Mumbai CST bridge collapse

మరిన్ని వార్తలు