పంత్‌కు మరోసారి పాఠాలు చెప్పిన ధోనీ

Submitted on 11 May 2019
MS Dhoni teaches Rishabh Pant again

మహేంద్ర సింగ్ ధోనీ వారసుడంటూ ఇప్పటికే ముద్ర వేయించుకున్న రిషబ్ పంత్ ఆ స్థాయిని అందుకోవడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. ఇక ఆఖరి సీజన్లో ధోనీ నుంచి మెలకువలు నేర్చుకున్న పంత్ తన ఆటలో వాటిని ప్రదర్శించినట్లు పలుమార్లు మీడియా వేదికగా తెలిపాడు. ఇలాగే వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ అనంతరం మరోసారి ధోనీ దగ్గర్నుంచి పాఠాలు నేర్చుకుంటూ మీడియా కంటపడ్డారు. 

ఢిల్లీ, చెన్నై జట్లకు కాంపైనర్లుగా పంత్, ధోనీలు సీజన్ ఆరంభంలో ప్రకటనల్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ 2వరకూ రాగలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌ను సంతృకరంగానే ముగించింది. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ చేతిలో 6వికెట్ల తేడాతో ఓటమికి గురైంది. మ్యాచ్ విజయానంతరం జరిగిన సెలబ్రేషన్స్‌లో ధోనీ కూడా పాల్గొనడం విశేషం.

'మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా. వారిలో క్రమశిక్షణ చాలా కీలకమైనది. మహీ భాయ్ ఏ రోజు దేనికీ లేట్‌గా రాలేదు. అతను అనుసరించే పద్దతే ఈ రోజు ఇంతస్థాయికి తీసుకొచ్చింది. ఏం సరిపోతుందో ఏది సరిపడదో అతనికి బాగా తెలుసు' అని మహీపై ప్రశంసలు కురిపించాడు. 

మే 10శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 9వికెట్లు నష్టపోయి 148పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. చేధనకు దిగిన చెన్నై ఓపెనర్లు చెరో హాఫ్ సెంచరీతో శుభారంభం చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ లాంచనాన్ని పూర్తి చేసి జట్టుకు విజయం అందించారు. 

MS Dhoni
rishabh pant
IPL 2019
IPL 12
IPL

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు