బ్రెగ్జిట్ ను మరోసారి తిరస్కరించిన ఎంపీలు

Submitted on 14 March 2019
MPs vote to reject no-deal Brexit

బ్రెగ్జిట్ ఒప్పందం  రెండోసారి బ్రిటన్ పార్లమెంట్ లో తిరస్కరణకు గురైంది. యూరోపియనప్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికొచ్చేందేకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరిసా మే కుదిర్చిన ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించడం ఇది రెండోసారి. జనవరిలో తొలిసారి బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి తుది గడువు మార్చి-29,2019 తేదీకి ఇక కేవలం 16 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది.

ఎలాంటి ఒప్పందమూ లేకుండా యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగే ప్రతిపాదనను బుధవారం సాయంత్రం పార్లమెంటులోని దిగువసభ 'హౌస్ ఆఫ్ కామన్స్‌'లో ఎంపీలు తిరస్కరించారు. బుధవారం(మార్చి-13,2019) రాత్రి బ్రిటన్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్ లో హైడ్రామా నడుమ జరిగిన ఓటింగ్ లో బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా 312 మంది ఓటు వేయగా 308 మంది అనుకూలంగా ఓటు వేశారు. అయితే ఈ ఓటింగ్ ఫలితానికే ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. ప్రస్తుత చట్టం ప్రకారం ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగవచ్చు.
Read Also : మళ్లీ చైనా అడ్డుపుల్ల : అజర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం

ఈయూ నుంచి వైదొలగేందుకు మరింత సమయం ఇవ్వాలని ఈయూను అనుమతి కోరాలా, వద్దా అనే అంశంపై గురువారం పార్లమెంట్లో ఓటింగ్ జరుగనుంది.ఈయూ నుంచి వైదొలిగేందుకు అవసరమైన చట్టాన్ని తెచ్చేందుకు వీలుగా బ్రెగ్జిట్‌ ను జూన్-30 వరకు వాయిదా వేయాలా అనే ప్రతిపాదనపై ఎంపీలు ఓటింగ్‌ లో పాల్గొననున్నారు.ఓటింగ్ తర్వాత ప్రధాని స్పందిస్తూ...ఎప్పుడూ ఉన్న ప్రత్యామ్నాయాలే ఇప్పుడూ మన ముందు ఉన్నాయి.

వైదొలగడంపై ఈయూతో ఏ ఒప్పందమూ కుదుర్చుకోకపోతే, అసలు ఒప్పందమే లేకుండా బయటకు రావాల్సి ఉంటుందని ఈయూ, బ్రిటన్‌లోని చట్టాలు చెబుతున్నాయి. ఏ ఒప్పందం చేసుకోవాలన్నది నిర్ణయించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకవేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి వైదొలిగితే  బ్రిటన్‌ తీవ్రంగా నష్టపోతుందని థెరిసా మే అన్నారు.

MP
BRITAN
BREXIT
Reject
deal
no
PM
therisa may
appeal
EU
Voting
AGAINEST

మరిన్ని వార్తలు