పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ : తల్లి అరెస్ట్

Submitted on 11 July 2019
Mother arrested after driving car with kids top on roof ..in an inflatable pool

ఓ తల్లి తన ఇద్దరు చిన్నారుల కోసం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసింది. దీంతో ఆ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటీ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయటంలో తప్పేంటి? అందుకు తల్లిని అరెస్ట్ చేయటమేంటీ.. టూ మచ్ కాకపోతే..అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. ఆమె స్విమ్మింగ్ పూల్ ను పెట్టింది ఎక్కడంటే తన కారు టాప్ పైన. కారు స్పీడ్ గా వెళ్తున్న సమయంలో తన పిల్లలిద్దరినీ కారుపైన ఉన్న పాడ్లింగ్ స్విమ్మింగ్ పూల్ లో ఉంచింది. 
 

అలా రోడ్డుపై కారు వెళ్తుండటం..కారుపైన స్విమ్మింగ్ పూల్ లో పిల్లలిద్దరు ఆడుకోవటం చూసిన స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ కోసం దర్యాప్తు చేపట్టగా ఆ కారు జెన్నిఫర్ జానస్ అనే 49 ఏళ్ల మహిళది అని తెలుసుకున్నారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి..చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించిదని..అది నేరంగా భావించి తల్లిని అరెస్ట్ చేశారు.
 

కాగా జెన్నిఫర్ తన ఫ్రెండ్ ఇంటి వద్ద పాడ్లింగ్ పూల్‌కు గాలి పెట్టించి తిరిగి వస్తున్న సమయంలో ఇది జరిగిందని పోలీసులు తెలిపారు. పదేళ్ల వయసు కూడా లేని చిన్నారులను అలా కారుపై పూల్‌లో పెట్టి ఎలా తీసుకొస్తారని, చిన్నారుల ప్రాణాలంటే లెక్క లేదా అంటూ జెన్నిఫర్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా వంటి కొన్ని దేశాలలో చిన్నారుల విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉంటాయి. వీటిని అతిక్రమించిన వారు తల్లిదండ్రులైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో కారు ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదకర పరిస్థితిలో పిల్లలను ఉంచినందుకు కన్నతల్లిపైనే చర్యలు తీసుకున్నారు అమెరికాలోని ఇల్లినాయిస్ పోలీసులు.  

america
Illinois
mother
Jennifer Janus
arrested
car roof
Driving
kids
swimming pool


మరిన్ని వార్తలు