అంత పవర్ ఏముందో: ఒక్క చాక్లెట్ రూ. 4.3లక్షలు

Submitted on 23 October 2019
The most expensive chocolate Rs. 4.3 Lakhs

చాక్లెట్ అంటే నోరూరని ఎవరైనా ఉంటారా. రుచిని బట్టి వీటిని కొనేందుకు ఎంతైనా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ ఓ చాక్లెట్ ధర చెబితే మాత్రం వామ్మో అంటారు. ఎందుకంటే...లక్షల్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది ఐటీసీ కంపెనీ.

FMCG దిగ్గజ కంపెనీ అయిన..ఐటీసీ.. ఫాబెల్లె బ్రాండ్ ట్రినీటీ - ట్రిపుల్స్ ఎక్స్‌ట్రార్డినర్ పేరిట ఈ చాక్లెట్‌‌ను రూపొందించింది. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేదంటోంది ఆ సంస్థ.

గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానం సంపాదించినట్లు కంపెనీ వెల్లడించింది. చేతిలో ఇమిడే..ఒక్కో చెక్కపెట్టేలో 15 ట్రపుల్స్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 15 గ్రాములున్నట్లు తెలిపింది.

ఒక కిలో రేటును నిర్ణయించినట్లు, కేవలం భారత్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయస్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటీసీ ఫుడ్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ రుస్తాగీ తెలిపారు. 
 

Read More : సోషల్ మీడియాతో ఆధార్ లింక్..కేంద్రం మార్గదర్శకాలు

most
EXPENSIVE
chocolate
FMCG
ITC Company

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు