‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్!

Submitted on 26 February 2020
 Most Eligible Bachelor-First Single Update

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఆడియో ఆల్బమ్ నుంచి మెద‌టి పాట‌ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లయ్యాయి. మార్చి 2న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఫ‌స్ట్ సింగిల్‌ని విడుద‌ల చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాతలు బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ తెలిపారు.

గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఇటీవ‌లే అఖిల్, పూజా హెగ్డేల‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ప్ర‌స్తుతం హైద‌ర‌బాద్ ప‌రిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగ‌ణంతో పాటు అఖిల్, పూజా హెగ్డే ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. 

ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ : గోపీ సుంద‌ర్, సినిమాటోగ్రఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ, ఎడిట‌ర్ : మార్తండ్ కె వెంక‌టేశ్, ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా, నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌, స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్, బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్.

Most Eligible Bachelor

Most Eligible Bachelor
First Single
Update
Akhil Akkineni
Pooja Hegde
Gopi Sundar
GA2 Pictures
Bunny Vas
Vasu Varma
Bommarillu Bhaskar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు