గర్భిణీ స్త్రీలలో మార్నింగ్ సిక్నెస్

Submitted on 14 May 2019
Morning Sickness In Pregnant Womens

గర్భిణుల్లో చాలా మందికి మార్నింగ్ సిక్ నెస్, వాంతులు ఎక్కువగా వేధిస్తుంటాయి. కానీ కొంతమందికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. మార్నింగ్ సిక్ నెస్ ఉండదు. వాంతులు కూడా ఉండవు. చాలా సాధారణంగా ఉంటుంది. కానీ 80 శాతం మంది గర్భిణులు ప్రెగ్నెన్సీ రాగానే కనిపించే ఈ మార్నింగ్ సిక్ నెస్ ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. 

మార్నింగ్ సిక్ నెస్ సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే మొదలవుతుంది. దీని లక్షణాలు రోజు గడిచిన కొద్దీ తగ్గుతాయి. ఉదయం పూట నిద్ర లేవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎంత లేట్ గా లేచినా ఇంకా  నిద్ర వచ్చినట్టే ఉంటుంది. ఎప్పుడూ పడుకోవాలని అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే వికారంగా ఉండడం, వాంతులు, కళ్లు తిరిగినట్టు కావడం లాంటి లక్షణాలు కనబడుతాయి. అందుకే దాన్ని మార్నింగ్ సిక్ నెస్ అని అంటాం. ఇది సహజంగా గర్భం దాల్చిన రెండు వారాల నుంచి మూడో నెల దాకా ఉంటుంది. మూడో నెల కంప్లీట్ అయ్యేదాకా ఉంటుంది. కొంతమందిలో మాత్రం అయిదో నెల దాకా కూడా కొనసాగుతుంది. కొందరిలో ప్రెగ్నెన్సీ అంతా ఉంటుంది. కొంతమందిలో సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. వామిటింగ్స్ ఇక ఏ రకంగానూ కంట్రోల్ కాకుండా పూర్తిగా డీహైడ్రేషన్ లోకి వెళ్లిపోతారు. వాంతులు, విరేచనాలతో నీరసపడిపోతారు. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, పోషకాహార లోపం ఏర్పడుతాయి. దీన్నే హైపర్ ఎమిసెస్ గ్రావిడేరమ్ అంటారు.  

మార్నింగ్ సిక్ నెస్ ఉన్నప్పుడు ఏది తిన్నా వెంటనే వాంతి అవుతున్నదని ఏమీ తినకపోతే లోపల బిడ్డకు గానీ, తల్లికి గానీ మంచిది కాదు. పోషకాహార లోపం వస్తుంది. అందుకని వాంతులవుతున్నా సరే కొంతవరకు తినడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఒక్కసారి కాకుండా అయిదారు సార్లు చిన్న చిన్న మోతాదుల్లో తినడం వల్ల వెంటనే వాంతి అయ్యే అవకాశం ఉండదు. మరీ ఎక్కువ వాంతులవుతుంటే కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. అవేమీ ప్రమాదమైనవి కావు. బి6 టాబ్లెట్లంటారు. అలాంటివి వేసుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది.

కొంతమంది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఫ్యాషనబుల్ గా ఉండాలని బిగుతైన ఫ్యాషనబుల్ డ్రెస్ వేసుకుంటుంటారు. మార్నింగ్ సిక్ నెస్ ఉన్నవాళ్లు వేసుకునే దుస్తులు కూడా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కొంచెం బిగుతుగా లేని డ్రెస్సులు వదులుగా సౌకర్యంగా ఉండేట్టుగా వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మీద అంత ప్రెషర్ పడదు. కొంతవరకు ఈ వామిటింగ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే విళ్ల నుంచి ఉపశమనం పొందొచ్చు.

Morning Sickness
Pregnant Womens
health tips
2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు