పేటీఎం యూజర్ల పెద్ద మనస్సు : అమర జవాన్లకు రూ.47కోట్లు విరాళం

Submitted on 14 March 2019
More than 20 lakh Paytm users donate Rs 47 crore to CRPF Wives Welfare Association

పుల్వామా ఉగ్రదాడి ఘటనతో దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ చలించిపోయారు. అమరులైన జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖలు తమ వంతు సాయంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు తమకు తోచినంత విరాళాలు అందజేశారు. ఓ యాచకురాలు బిక్షాటన చేసి కూడబెట్టిన లక్షల రూపాయలను వీర జవాన్లకు విరాళం ఇవ్వగా, స్కూల్ ప్రిన్సిపల్ తన బంగారు గాజులు అమ్మి జవాన్ల కుటుంబాలకు లక్షన్నర విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో పేటీఎం యూజర్లు కూడా చేరిపోయారు. రోజుకు ఎంతో మంది పేటీఎం యూజర్లు తమ అవసరాల కోసం పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంకును వాడుతుంటారు.
Read Also : వన్ టైం ఛార్జింగ్ : కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

20 లక్షలకు పైగా యూజర్లు.. రూ.47 కోట్లు
అందులో కొంత మొత్తాన్ని పేటీఎం యూజర్లు వీర జవాన్లకు విరాళంగా అందజేశారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 50 మంది వరకు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీర జవాన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 10 మధ్య కాలంలో 20లక్షలకు పైగా పేటీఎం యూజర్లు పేటీఎం వేదికగా ముందుకొచ్చి అమర జవాన్లకు సంఘీభావంగా కోట్ల విరాళాలు అందజేశారు. సీఆర్పీఎఫ్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (CWA) కు 20లక్షలకు పైగా పేటీఎం యూజర్లు రూ.47 కోట్లు విరాళంగా అందించారు. 

చెక్ రూపంలో CWAకు అందజేసిన పేటీఎం
యూజర్ల కోట్లాది విరాళాలను సదరు కంపెనీ చెక్ రూపంలో సీఆర్ పీఎఫ్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మను భట్ గనర్ కు అందజేశారు. పేటీఎం కంపెనీ సీడబ్ల్యూఏతో సంయుక్తంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అమర జవాన్లకు ఫండ్స్ సేకరించేందుకు పేటీఎం మొబైల్ యాప్, వెబ్ సైట్ తో కలిసి పనిచేసింది. యూజర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని విరాళంగా సీడబ్ల్యూఏ కర్పస్ ఫండ్స్ కు చేరుతుంది. పేటీఎం యాప్ ద్వారా సేకరించిన మొత్తం విరాళాలకు ట్రాన్స్ జెక్షన్ ఫీ నుంచి మినహాయింపు ఉంది.

కేరళ వరద బాధితులకు రూ.30 కోట్లు విరాళం
అంతేకాదు.. సెక్షన్ 80జీ కింద ట్యాక్స్ బెనిఫెట్స్ కూడా పొందే అవకాశం ఉంది. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన యూజర్లకు పేటీఎం సీఓఓ కిరణ్ వాసిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ముందు కేరళలో వరద బాధితుల కోసం పేటీఎం విరాళాలను సేకరించింది. కేరళ వరద బాధితుల కోసం 12 లక్షల మంది పేటీఎం యూజర్ల నుంచి రూ.30 కోట్లు విరాళంగా సేకరించింది. ఈ మొత్తాన్ని కేరళ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు.  
Read Also : వారి వయసు 265 ఏళ్లట : ఓటర్ల లిస్ట్ లో సిత్రాలు

Pulwama Attack
Paytm users
CRPF
CRPF Wives
Welfare Association
  

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు