Monkeys escape with COVID-19 samples after attacking lab assistant

ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి చేసి.. కరోనా శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను కోతులు ఎత్తుకెళ్లాయి. కరోనా పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతులు అతనిపై దాడి చేసి ఆ టెస్ట్ కిట్లను ఎత్తుకుపోయింది. అందులో ఓ కిట్‌ను ఓ కోతి కరాకరా నమిలేయగా.. మరో రెండు కిట్లను తీసుకొని ఇతర కోతులు ఇళ్లపై ఉరుకుతున్నాయి.

దీంతో స్థానికులంతా భయంతో వణికిపోతున్నారు. అక్కడివారు చెప్పిన ప్రకారం, జంతువులు ముగ్గురు రోగుల నుండి తీసుకున్న COVID-19 రక్త పరీక్ష నమూనాలను లాక్కొని పారిపోయాయి. ముగ్గురు కరోనా అనుమానితులకు చేసిన టెస్ట్ శాంపిల్స్ అందులో ఉండిపోయాయి. ప్రస్తుతం ఆ శాంపిల్స్ కోతుల దగ్గర ఉండడంతో వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కరోనా టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్తున్న వాటిల్లో ఓ కోతి శాంపిల్ కిట్‌ను కొరుకుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

అయితే ఆ కోతులను త్వరగా పట్టుకోవాలంటూ డాక్టర్లు అటవీ శాఖ అధికారుల సాయం కోరారు. ఇక చాలా సేపటికి పాడైపోయిన ఆ కిట్లను స్వాధీనం చేసుకున్నట్లు మీరట్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ధీరజ్ రాజ్ AFPకి తెలిపారు. అంతేకాదు గత రెండు నెలలుగా లాక్డౌన్ చర్యలు కోతులను ధైర్యం చేశాయని నమ్ముతారు.

Related Posts