చింతమనేని కంప్లయింట్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అరెస్టు

Submitted on 21 February 2019
MLA Chintamaneni controversial comments over Dalits

ఆ వీడియో నాది కాదు..అలాంటి మాటలు మాట్లాడలేదు..వీడియోను ఎడిట్ చేశారు...దీనికి కారకులైన వారిని కనుక్కొని అరెస్టు చేయండి అంటూ టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఇచ్చిన కంప్లయింట్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమగోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్ దీనికి కారణమంటూ ఫిబ్రవరి 21వ తేదీ గురువారం అరెస్టు చేయడం కలకలం రేపింది. చింతమనేనికి సంబంధించిన వీడియోను రవి జైన్ షేర్ చేశాడంటూ పోలీసులు అరెస్టు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 

చింతమనేనికి సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. దళితులను ఇలా కించపరిచి మాట్లాడుతారా ? అంటూ దళితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. చింతమనేని దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీనిపై చింతమనేని స్పందించారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు...వీడియోను కట్ చేసి ఎడిట్ చేశారని పేర్కొంటూ ఎస్పీకి చింతమనేని కంప్లయింట్ చేశారు. దీనిపై విచారించిన పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత రవి జైన్ వీడియోను పోస్టు చేశారంటూ అరెస్టు చేసి పెదపాడు స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. 

అరెస్టుపై ఆ పార్టీకి చెందిన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవిని వెంటనే రిలీజ్ చేయాలని లేనిపక్షంలో ఆందోళనలకు దిగుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాలి. 

Read Also:పిల్లినైనా కాకపోతిని : ఫ్యాషన్ ఐకాన్ మృతి...పిల్లికి 14వేల కోట్ల ఆస్తి
Read Also:ఆడకుంటే మనకే నష్టం.. ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం..!
Read Also:నీళ్ల ట్యాంకే గుడి : పూజలు చేస్తున్న గ్రామస్థులు

MLA Chintamaneni
controversial
Comments
dalits
Denduluru MLA
Kattula Ravi
Jain

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు