2 నెలల EMI చెల్లించకపోతే.. అదనంగా 10 నెలలు చెల్లించాలా!

Submitted on 1 April 2020
Missing two instalments may add 10 months to loan

కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే రుణ ఖాతాదారుల కోసం బ్యాంకులు రుణ వాయిదా చెల్లింపులపై ఉపశమనం కలిగేలా ఆఫర్లు అందిస్తున్నాయి. రిలీఫ్ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటివకూ బ్యాంకులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇంతకీ ఈ రిలీఫ్ ప్యాకేజీ ఎలా అమలు చేస్తుందో తెలియదు. 

రుణం చెల్లించేందుకు ఇది మాత్రమే అదనపు కాలం కావడంతో చెల్లించని మొత్తంపై బ్యాంకులు వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంది. మీరు తీసుకున్న రుణానికి సంబంధించి నెలవారీ (EMI) వాయిదాల చెల్లింపుల్లో కనీసం రెండు EMIలు చెల్లించకపోయినా మీ లోన్ కాల పరిమితి 6 నెలల నుంచి 10 నెలల వరకు పొడిగించడం జరుగుతుంది. లేదంటే.. చెల్లించాల్సిన EMI మొత్తం 1.5 శాతానికి పెరుగుతుంది. రుణ ఖాతాదారులకు బ్యాంకులు మూడు ఆప్షన్లు ఇస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..  

ఆప్షన్ -1 : ఏప్రిల్, మే నెలల్లో వచ్చే వడ్డీకి జూన్‌లో వన్‌టైమ్ చెల్లింపు ఉంటుంది. 
ఆప్షన్ - II : ఔట్ స్టాండింగ్ మొత్తానికి వడ్డీ యాడ్ అవుతుంది. మిగిలిన నెలలకు EMI పెరుగుతుంది.
ఆప్షన్ - III : EMI ని మార్చొద్దు.. కాని రుణ కాల పరిమితిని పొడిగించండి.

మీరు ఎన్నో EMIలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అనేది మీరు తీసుకున్న రుణం కాల పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల ఇంటి రుణాన్ని 20 ఏళ్లకు తీసుకున్నారనుకుందాం.. దీనిపై EMI రూ.44,986 ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చే ఏప్రిల్, మే నెలల రెండు EMIలను స్కిప్ చేయాలనకుంటే.. మీ రీపేమెంట్ షెడ్యూల్ పై మారటోరియం ప్రభావం ఎలా ఉంటుందంటే!  

స్పష్టంగా చెప్పాలంటే.. దీర్ఘకాలిక పరిమిత కాలం ఉన్న రుణాలపై భారీ ప్రభావం ఉంటుంది. అందుకే ఈఎంఐల చెల్లింపు ప్రారంభ సంవత్సరాల్లో విధించే వడ్డీ భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. మొదటి సంవత్సరం తర్వాత కూడా EMIలో దాదాపు 80 శాతం వడ్డీ ఉంటుంది. కానీ, 19వ సంవత్సరంలో ఈఎంఐలో విధించే వడ్డీ 10 శాతానికి పడిపోతుంది.

ఎవరైతే 10 నుంచి 15 ఏళ్ల క్రితం తీసుకుంటారో అట్టి రుణాలపై పెద్దగా ఇబ్బందేమి ఉండదు. కానీ, 2 నుంచి 3 ఏళ్ల క్రితం తీసుకున్న కొత్త లోన్లు తీసుకున్నవారికి కలిగినంత ఇబ్బంది మాత్రం ఉండదు. కొత్త రుణాలపై మారటోరియం అవసరమైనంతగా పాత రుణాలకు మారటోరియం అవసరం లేదని గుర్తించాలి. 

Also Read | ఎవరైనా కరోనా వారియర్స్ చనిపోతే...వారి కుటుంబాలకు 1కోటి ఇస్తామన్న కేజ్రీవాల్

Missing two instalments
EMI
banks
moratorium
Coronavirus outbreak
Indian Lock Down

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు