కనపడుట లేదు: 18 పెంపుడు కుక్కలే మనిషిని తినేశాయ్

Submitted on 11 July 2019
 Missing Man In Texas Was Eaten By His Only Companions

ఏప్రిల్‌లో కుటుంబమంతా ఓ పార్టీలో కలిసింది. ఆ తర్వాత సమయం కుదరక మళ్లీ కలుద్దామని వెళ్తే మనిషి కనిపించలేదు. ఏమైయ్యాడోనని ఆచూకీ కోసం వెదికితే ఎముకల ముక్కలు దొరికాయి. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన జరిగింది. ఫ్రెడ్డీ మాక్ అనే వ్యక్తిని తన పెంపుడు కుక్కలే చంపేశాయని ఓ ఇంగ్లీష్ మీడియా కథనంలో వెల్లడించింది.  

మాక్ బంధువు మాట్లాడుతూ.. ఏప్రిల్ 19న మేమందరం కలిశాం. చాలా రోజుల తర్వాతి మళ్లీ చూడడానికి అతని ఇంటికి వచ్చాం. మాకు చిన్న ఎముక దొరికింది. అనుమానంతో  ఇంకొంచెం శోధిస్తే 4-5అంగుళాల ఎముకలు దొరికాయి. దాంతో పాటు మనిషి జుట్టు, మాక్ ధరించే దుస్తులు దొరకడంతో నిర్ధారించుకున్నాం. మాక్ 18రకాల జాతుల కుక్కలను పెంచేవాడు' అని తెలిపాడు.  

మీడియా కథనం ప్రకారం.. 'మనుషులతో సంబంధం లేకుండా జీవిస్తాడు. రెండు నెలలకోసారి మాత్రమే వ్యక్తులతో కలిసి గడుపుతాడు. అతను ఉండే నివాసం చుట్టూ పెంపుడు కుక్కలే ఉంటాయి. బంధువులంతా వచ్చి ఆయనను తీసుకెళ్లి కొన్ని రోజులు గడిపి మళ్లీ తీసుకొచ్చి అక్కడే వదిలేస్తారు. ఆ విరామ సమయంలో వ్యక్తులతో సంబంధం లేకుండా గడిపేస్తాడు. మాక్ చనిపోయాక కుక్కలు తినేశాయా.. ఆహారం కోసం బతికుండగానే చంపేశాయా..' అనే కోణంలో విచారిస్తున్నారు
 

Missing Man
texas
18 dogs


మరిన్ని వార్తలు