పవన్ హచ్ కుక్కని మించిపోయారు : నాయకుడో, నటుడో అర్థం కావడం లేదు

Submitted on 2 December 2019
minister anil kumar yadav fires on pawan kalyan

మతం మారినా ఇంకా మీ పేరులో రెడ్డి ఎందుకు అంటూ సీఎం జగన్ మతాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పవన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. పవన్ ని రాజకీయ అజ్ఞానితో పోల్చారు. మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుని ఫాలో కావడంలో పవన్ హచ్ డాగ్ ను మించిపోయారని ఎద్దేవా చేశారు. అసలు.. పవన్ రాజకీయ నాయకుడో, నటుడో అర్థం కావడం లేదన్నారు మంత్రి అనిల్. ''పవన్ ను పొలిటీషియన్ అనలేము. అలా అని హీరో అందామా అంటే.. సినిమాల్లేవు. పోనీ మేధావి అందామంటే పవన్ కన్నా పెద్ద అజ్ఞాని ఎవరూ లేరు. ప్రతిపక్ష నేత అని పిలుద్దామంటే పవన్ ఒక్కచోటా గెలవలేదు. అసలు పవన్ ని ఏమని పిలవాలో తెలియటం లేదు'' అని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్.

సీఎం జగన్ దమ్ము, ధైర్యం ఏంటో ప్రజలకు తెలుసు అన్న మంత్రి అనిల్.. పవన్ చెప్సాల్సిన అవసరం లేదన్నారు. జగన్ ని పవన్ ఎలా పిలిచినా పట్టించుకునే వారు ఎవరూ లేరన్నారు. కులాలు, మతాలు లేవంటూనే.. పవన్ వాటి గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. పవన్ వల్ల ఏమీ కాదని.. ఎవరి తోలు, తాటలు తీయలేరు అని మంత్రి అన్నారు. ముందు.. సోషల్ మీడియాలో దుర్మార్గపు పోస్టింగ్ లు పెడుతున్న తన ఫ్యాన్స్ ని పవన్ సన్మార్గంలో పెట్టుకోవాలని సూచించారు. ప్రశ్నిస్తానంటున్న పవన్ ను రేణు దేశాయ్ ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు.

పవన్ చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు. రాయలసీమపై పవన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని సీరియస్ అయ్యారు. గోదావరి జిల్లాలకు వెళ్లి రాయలసీమ గూండాలు.. కడప రౌడీలు .. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అని తిడతారని గుర్తు చేశారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లి ఒకసారి పచ్చటి పొలాలు అంటారు...మరోసారి సీమలో కరువు ఉందని అంటారు.. ఎక్కడేం చెబుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేసారు. పవన్ సత్తా ఏంటో ఐదేళ్లుగా చూసిన ప్రజలు..ఆయన సత్తాకు తగినట్లుగానే తీర్పు ఇచ్చారన్నారు.

జనసేన పార్టీ అభ్యర్థులకు రాయలసీమ ప్రాంతంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. 2017లో జరిగిన హత్య ఘటనను వైసీపీ ప్రబుత్వంపై రుద్దుతున్నారని పవన్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఆ ఘటనపై పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. 

minister anil kumar yadav
Pawan kalyan
janasena
Ysrcp
cm jagan
caste
religion
Chandrababu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు