Mega Brother Nagababu's serious on hero Balakrishna's comments

బాలయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు : మెగా బ్రదర్ నాగబాబు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రభుత్వంతో సినీ పెద్దల మీటింగ్ గురించి హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు నాగబాబు. పేద కార్మికులకు ప్రతి ఒక్కరూ సాయం చేశారని గుర్తు చేశారు. షూటింగుల ప్రారంభంపై చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమయ్యారే తప్ప అందులో సొంత ప్రయోజనాలు లేవని చెప్పారు. 

ఆయనను పిలిచారో పిలవలేదో మీటింగ్ నిర్వహించిన వ్యక్తులను అడగాల్సిన బాధ్యత బాలకృష్ణపై ఉందన్నారు. తనను పిలువ లేదని బాలకృష్ణ కోపపడటంలో అర్థం ఉందన్నారు. భూములు పంచుకుంటున్నారు…అందుకనే కలిశారని వెనక్కి ఏదో మాట్లాడి బూతు మాట్లాడపోతుంటే బీప్ ఏశారని తెలిపారు. సమావేశానికి బాలకృష్ణను పిలవకపోవడం రైట్ అని తాను అనడం లేదన్నారు. 

కమ్యూనికేషన్ గ్యాప్ తో వేరే కారణంతోనైనా పిలవకపోవచ్చు .. ఆ కారణం తెలుసుకుని…దానిపై అడిగినా తప్పేమి లేదన్నారు. కానీ భూములు పంచుకుంటున్నారని ఉక్రోశంగా మాట్లాడిన మాట ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, ఆర్టిస్టుగా తనకు కచ్చితంగా బాధ కల్గిందన్నారు. అర్జెంట్ గా బాలయ్య మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలన్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటమనేది కరెక్టు కాదన్నారు. మీరు అలా మాట్లాడుతానంటే అంతకంటే పది రెట్లు మాట్లాడటానికి ఇక్కడ చాలా మంది రెడీగా ఉన్నారని తెలిపారు.

బాలకృష్ణ గారు…కొంచెం నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడాలన్నారు. ఇండస్ట్రీ బాగు కోసం వెళ్లారు తప్ప భూములు పంచుకోవడానికి వెళ్లలేదన్నారు. తమను కూడా పిలవ లేదన్నారు. ఇండస్ట్రీపై మీకు ఉన్న రెస్పెక్ట్ ఇదేనా అనిప్రశ్నించారు. బాలకృష్ణ చాలా చాలా తప్పు మాట్లాడారని చెప్పారు. చలన చిత్ర పరిశ్రమను అవమానించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించారని అన్నారు. సినీ ఇండస్ట్రీకి, టీఆర్ ఎస్ ప్రభుత్వానికి కచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుందని బాలకృష్ణను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఇంకెప్పుడు తప్పుడు మాటలు మాట్లాడవద్దన్నారు. 

ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదన్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తే…రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరో చేశారో తెలుస్తుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆంధ్రప్రదేశ్ ను ఎలా నాశనం చేశారో..టీడీపీని నమ్మి సామాన్యుల జీవితాలు ఎలా సర్వనాశనం అయ్యాయో తెలుస్తుందన్నారు. ‘మీరు ఏం మాట్లాడినా నోరు మూసుకుని కూర్చుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరన్నారు. ఇండస్ట్రీకి మీరేమీ కింగ్ కాదని.. యువార్ జస్ట్ వన్ హీరో దట్సాల్’ అని బాలకృష్ణను ఉద్దేశించి నాగబాబు వ్యాఖ్యానించారు. 

Related Posts