డాక్టర్ల శ్రమ వృథా : అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన శిశువు మృతి

Submitted on 20 July 2019
Medics rush rare Bombay blood to 14-day-old baby, but fail to save her

కోల్ కతాలో అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన 14 రోజుల శిశువు మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువు శుక్రవారం జులై 19 వ తేదీ మరణించింది. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. 

జులై 5 వ తేదీ చిత్తరంజన్ సేవా సదన్ లో శిశువు జన్మించింది. అనారోగ్యం బాధపడుతుండడంతో జులై 15 ఎన్ఆర్ ఎస్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రికి తరలించారు. పేగులో అవరోధం సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనికి అత్యవసర శస్త్రచికిత్స మరియు రక్త మార్పిడి అవసరం ఏర్పడింది. జూలై 16 వ తేదీ వైద్యులు సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌కు ఒక ఎస్ వోఎస్ పంపారు. శిశువు బాంబే బ్లడ్ గ్రూప్ కలిగి ఉందని వివరించారు. 

24 గంటల్లో రక్త మార్పిడి చేయాలని చెప్పారు. జూలై 16 న ఉదయం 10 గంటల నుండి మరియు జూలై 17 ఉదయం 10 గంటల వరకు రక్త మార్పిడి చేయాల్సివుంటుందని ఎన్‌ఆర్‌ఎస్ వైద్యులు శుక్రవారం చెప్పారు. బెంగాల్ లో 40 మంది బాంబే బ్లడ్ గ్రూప్ దాతలు మాత్రమే ఉన్నారని తెలుసుకున్నామని ఎన్‌ఆర్‌ఎస్ బ్లడ్ బ్యాంక్ యూనిట్ హెడ్ దిలీప్ కుమార్ పాండా తెలిపారు. 

తాము బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించామని సీనియర్ బ్లడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. దగ్గర్లో ఎవరు ఉన్నారు, ఎవరు NRS క్యాంపస్‌కు వచ్చి బ్లడ్ ను దానం చేస్తారోనని తీవ్రంగా వెతికామని తెలిపారు. హుగ్లీలోని భద్రేశ్వర్ ప్రాంతంలో సోనాలి పాన్ (33) అనే మహిళను గుర్తించామని తెలిపారు. ఆమెను సంప్రదించగా వెంటనే రక్తం దానం చేసేందుకు అంగీకరించింది. ఆమె బుధవారం ఎన్‌ఆర్‌ఎస్‌కు చేరుకుని ఒక యూనిట్ రక్తాన్ని దానం చేసింది. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని శిశువుకు ఎక్కించగా సెప్టిసిమియా తీవ్రం కావడంతో శిశువు శుక్రవారం మరణించింది.

బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు జనాభాలో అత్యంత అరుదగా ఉంటారు. ప్రతి పది లక్షల మందిలో నలుగురు బాంబే బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటారు. వారు ఇతర బ్లడ్ గ్రూప్ రక్తాన్ని తీసుకోలేరు. ప్రత్యేకంగా బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన వారికి శస్త్ర చికిత్స సమయంలో రక్తమార్పిడి చేసే సయంలో హాని కలిగే అవకాశం ఉంది. 

Medics
rush
rare Bombay blood
14-day-old baby
Dead
Kolkata

మరిన్ని వార్తలు