చలో చార్మినార్ : మండే ఎండల్లో ‘మత్వాల’ లస్సీ 

Submitted on 14 May 2019
Matwale Doodh Ghar..in Charminar  Best Lassi Hyderabad

నగరంలో భానుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి బొండాలు..పుదీనా వాటర్, చెరుకు రసం వంటివాటితో ప్రజలు తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. కానీ ఈ మండిపోయే ఎండల్లో మరో చక్కటి పానీయం ఉంది. అదే  లస్సీ. చల్లటి మజ్జిగలో  కాస్తంత చక్కెర వేసుకుని..ఓ చెక్క నిమ్మరం పిండుకుని తాగితే వడ దెబ్బ మటుమాయం. ఇది మనం ఇళ్ళలో చేసుకుంటాం. కానీ లస్సీల్లో చాలా రకాలున్నాయి.

హైదరాబాద్ నగరంలోనే చార్మినార్ ప్రాంతంలోని మత్వాలే దూద్ ఘర్‌ లో  దొరికే టేస్టీ..టేస్టీ లస్సీ వెరీ వెరీ స్పెషల్.ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ తాగేలనుకునేంత టేస్ట్ ఈ మత్వాల లస్పీ స్పెషల్.  ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ తాగేలనుకునేంత టేస్ట్ ఈ మత్వాల లస్పీ స్పెషల్. 

చారిత్రాత్మక కట్టడం  ఛార్మినార్ సమీపంలోని మత్వాలే దూద్ ఘర్‌కు వచ్చేశారంటే చల్లటి టేస్టీ లస్సీ తాగేయొచ్చు. వేసవి వచ్చిందంటే చాలు..లస్సీ ప్రియులంతా ఇక్కడికే వాలిపోతారు. గత 52 ఏళ్లుగా ఈ లస్సీ ఫేమస్.

ఈ లస్సీ గురించి షాపు యజమాని మహ్మద్ మత్వాలే 1967 నుంచి ఇప్పటివరకు లస్సీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చక్కటి టేస్టీ లస్సీని వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. తరతరాలుగా నాణ్యతలో రాజీపడకుండా పనిచేస్తుండటం వల్ల వినియోగదారుల నమ్మకాన్ని గెలుసుకున్నామని మత్వాలే తెలిపారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు సైతం తాగేందుకు వీలుగా ఇక్కడ సుగర్‌లెస్ లస్సీ మత్వాలే షాపులో స్పెషల్.

Matwale
Doodh Ghar
charminar
lassi
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు