మత్తు వదలరా - ఫస్ట్ లుక్

Submitted on 23 October 2019
 Mathu Vadalara First Look

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి ‘మత్తు వదలరా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు ఎక్కువ శాతం కొత్తవాళ్లు  పనిచేయనున్న ఈ సినిమాకు టైటిల్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతుండడం విశేషం..

న్యూస్ పేపర్స్‌పై నిద్రపోతున్న హీరో, అతని టీ-షర్ట్‌పై టెక్నీషియన్స్ పేరుతో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ కూడా ఇచ్చారు. మూవీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ తారక్ ట్వీట్ చేశాడు..

Read Also : హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్ : అప్పుడు ‘రెబల్ స్టార్’ ఇప్పుడు ‘గ్లోబల్ స్టార్’

రితేష్ రానా డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతుండగా.. ‘దండాలయ్యా’, ‘పెనిమిటి’ పాటలతో అలరించిన కాల భైరవ సంగీత మందించనున్నాడు. చిరంజీవి (చెర్రీ) - సుమలత నిర్మిస్తున్నారు. కెమెరా : సురేష్ సారంగం, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, సంగీతం : కాల భైరవ, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్.
 

Mathu Vadalara
Mythri Movie Makers
Clap Entertainment
Kaala Bhairava
Ritesh Rana

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు