లాక్ డౌన్ వేళ మార్వెల్ బంపర్ ఆఫర్, ఉచితంగా 12 డిజిటల్ కామిక్స్, ఇక ఇంట్లోనే ఫుల్ టైమ్ పాస్

Submitted on 5 April 2020
Marvel Is Giving Away 12 Free Comics To Help You Pass The Time At Home

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇల్లు దాటి బయటకు రావడం లేదు. పిల్లలు, పెద్దలు అంతా ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. అయితే గంటలు గంటలు ఇంట్లో ఉండాలంటే ఎవరికైనా బోరింగే. పిల్లలు, యువత పరిస్థితి మరీ దారుణం. వారికి మరీ బోరింగ్ ఉంది. అస్సలు టైమ్ పాస్ అవ్వడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. అలాంటి వారికి మార్కెల్ గుడ్ న్యూస్ వినిపించింది. టైమ్ పాస్ కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 12 డిజిటల్ కామిక్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అది కూడా ఉచితంగానే.

కొన్ని వారాలుగా గేమ్స్, ఎంటర్ మైన్ కంపెనీలు సోషల్ డిస్టెన్స్ ను ప్రమోట్ చేస్తున్నాయి. ఫ్రీ ప్రొడక్ట్స్, ఆఫర్స్ ఇస్తూ సోషల్ డిస్టేన్స్ ను ప్రమోట్ చేస్తున్నాయి. గేమ్ పబ్లిషర్లు ఈ విషయంలో ముందున్నారు. ఆన్ లైన్ లో మరిన్ని ఉచిత గేమ్స్ ఇస్తున్నారు. సబ్ స్క్రిప్షన్ సర్వీసులు అందించే Shudder, CBS All Access, Comixology వంటి గేమ్ పబ్లిషర్లు ఫ్రీ ట్రయల్ కాలాన్ని పొడిగించాయి. ఇప్పుడు మార్వెల్ కూడా ఆ జాబితాలో చేరింది. ఉచితంగా కామిక్ బుక్స్ ఇస్తోంది. ఇందులో 12 కామిక్స్ ఉన్నాయి. వాటిని డౌన్ లౌడ్ చేసుకోవచ్చు.

మార్వెల్ అన్ లిమిటెడ్ యాప్ నుంచి ఈ కామిక్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సైనప్ అవ్వాల్సిన అవసరమూ లేదు. అమెజాన్స్ Comixology platform ద్వారా కూడా కామిక్స్ పొందొచ్చు. Civil war తో Ta nehisi coates black panther, multiple avenger arcs డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 4 వరకు ఈ 12 కామిక్స్ కూడా ఫ్రీ గా ఇస్తున్నారు. 

ఇండోర్ లో ఉంటూ డిజిటల్ కామిక్స్ చదవడం మంచి టైమ్ పాస్ అవుతుందని కంపెనీ వాళ్లు చెబుతున్నారు. డిజిటల్ కామిక్స్ చదవడానికి మీరు కొత్త అయినట్టు అయితే, మీలాంటి వారి కోసం comixology unlimited ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. వారి దగ్గర 25వేల కామిక్స్ ఉన్నాయి. నెలకు 6డాలర్లు చెల్లిస్తే చాలు. 60 రోజుల ఫ్రీ ట్రయల్ ఇస్తారు. అదే మార్వెల్ వాళ్లు నెలకు 10డాలర్లు వసూలు చేస్తున్నారు.

సో ఇంకెందుకు ఆలస్యం. ఇంట్లో ఉండి ఉండి బాగా బోరింగ్ ఫీలయ్యే వాళ్లు వెంటనే మార్కెల్ డిజిటల్ కామిక్స్ డౌన్ లోడ్ చేసుకోండి. టైమ్ పాస్ చేయండి. పనిలో పనిగా ఎంజాయ్ కూడా చేయండి. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కరోనా వైరస్ మహమ్మారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

Marvel free comics
Amazing Spider-Man: Red Goblin
Avengers: The Final Host
Avengers: Kree/Skrull War
Avengers vs. X-Men
Black Panther Vol. 1
Black Widow Vol. 1: SHIELD's Most Wanted
Captain America: Winter Soldier Ultimate
Captain Marvel Vol 1: Higher, Further, Faster, More
Civil War
Fantastic Four Vol. 1: Fourever
Thanos Wins
X-Men Milestones: Dark Phoenix Saga

Marvel
12 Free Comics
time pass
home
digital comics
amazing spider

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు