మణిపూర్ వ్యక్తికి Facebook రివార్డ్ : వాట్సాప్ లో Bug కనిపెట్టింది ఇతడే

Submitted on 11 June 2019
Manipur man detects WhatsApp bug, enters Facebook 'Hall of Fame'

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో బగ్ కారణంగా యూజర్ ప్రైవసీలో ఇష్యూ తలెత్తింది. యూజర్ల ప్రైవసీ ఉల్లంఘనకు కారణమైన బగ్ ను మణిపూర్ కు చెందిన జోనెల్ సౌగాయ్జామ్ (22) అనే సివిల్ ఇంజినీర్ కనిపెట్టాడు. అతడి ప్రతిభను గుర్తించిన ఫేస్ బుక్ 5వేల డాలర్లు (రూ.3లక్షల 47వేల 212)ను బహుమతిగా ప్రకటించింది. అంతేకాదు.. ఫేస్ బుక్ హాల్ ఆఫ్ ఫేమ్ 2019లో కూడా చోటు కల్పించింది. దీంతో ఈ ఏడాది ఫేస్ బుక్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో 94మందిలో మణిపూర్ యువకుడు సౌగాయ్జామ్ పేరు 16వ స్థానంలో నిలిచింది. 

వాట్సాప్ లో వాయిస్ కాల్ ద్వారా బగ్.. యూజర్ల ప్రైవసీకి తలనొప్పిగా మారింది. ఈ బగ్ కారణంగా యూజర్ల అనుమతి లేకుండానే వీడియో కాల్ మరో కాలర్ ను అనుమతి ఇస్తోంది. ఆ విషయం యూజర్ కూడా తెలియదు. వీడియో కాల్ ద్వారా ఇతరులు ఏం చేస్తున్నారో చూడవచ్చు. ఒక యూజర్ అనుమతి లేకుండానే అతడి కాల్ వినడం కానీ, చూడటం ప్రైవసీ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇదంతా బగ్ కారణంగానే జరుగుతుందని మణిపూర్ సివిల్ ఇంజినీర్ గుర్తించాడు. వెంటనే .. ఆ విషయాన్ని ఫేస్ బుక్ సంబంధిత బగ్ బౌంటీ ప్రొగ్రామ్ కు సమాచారం అందించాడు. 

ఈ బౌంటీ ప్రొగ్రామ్.. వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. సౌగాయ్జామ్ ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన ఫేస్ బుక్ సెక్యూరిటీ టీం.. మరుసటి రోజు టెక్నికల్ డిపార్ట్ మెంట్ తో కలిసి 15 నుంచి 20 రోజుల్లో బగ్ ఇష్యూను ఫిక్స్ చేసింది. ఆ తర్వాత సౌగాయ్జామ్ కు 5వేల డాలర్ల బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు ఈమెయిల్ ద్వారా ఫేస్ బుక్ తెలిపింది. ఈ నెలలోనే ఫేస్ బుక్ హాల్ ఆఫ్ ఫేమ్ పేజీలో తన పేరును చేర్చినట్టు తెలిపాడు. 

Manipur man
Whatsapp bug
Facebook 'Hall of Fame
Zonel Sougaijam
civil engineer
Facebook 

మరిన్ని వార్తలు