మొక్కలతో మాట్లాడుతున్న మంచు లక్ష్మీ.. ఏకంగా చెట్టెక్కి మరీ..

manchu-lakshmi-about-mango-tree-her-house

లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం అందరూ ఇళ్లకే  పరిమితం అయ్యారు. సెలబ్రిటీల సంగతి చెప్పక్కర్లేదు. ఈ కరోనా లాక్‌డౌన్ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 


తాజాగా మంచు లక్ష్మీ మొక్కలతో మాట్లాడడం స్టార్ట్ చేసిందట. తన ఇంటి పెరటిలో ఉన్న మామిడి చెట్టును ఆమె ఇప్పటి వరకు పట్టించుకోలేదట. ఇప్పుడు ఆ మామిడి చెట్టునే కాకుండా తన పెరటిలో ఉన్న మొక్కలన్నిటినీ ఫ్యామిలీ మెంబర్స్‌గా భావిస్తూ.. రోజూ వాటితో మాట్లాడుతూ.. వాటికోసం కాసేపు సమయం కేటాయిస్తుందట. ఈ విషయాలన్నీ తెలుపుతూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసింది.


‘‘నా చిన్నప్పటి నుంచి మా ఇంటిలోనికి వెళ్లే మెయిన్ దారిలో ఉన్న ఈ చెట్టును చూస్తున్నాను. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ ‘హాయ్’ కూడా చెప్పలేదు. అలాగే ఆ చెట్టు వల్ల చుట్టూ ఉన్న ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా గుర్తించలేదు. ఇప్పుడు చాలా టైమ్ ఉండటంతో.. వాటికోసం సమయం కేటాయిస్తున్నాను..’’ అని పోస్ట్ చేసిన మంచు లక్ష్మి తన కూతురు విద్యా అడిగిందని చెట్టు ఎక్కి మరీ మామిడికాయను కోసి తన కూమార్తెకు ఇవ్వగా.. తను థ్యాంక్స్ చెప్పింది. మంచు లక్ష్మీ మామిడికాయలు కోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని తాజా వార్తలు