GWM To Invest $1 Billion In India In A Phased Manner; Signs MOU With Maharashtra Government 

ఆరు అంతస్థులపై నుంచి వేలాడుతున్న బాలికను కాపాడిన వ్యక్తి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆరు అంతస్థుల మేడపై నుంచి వేలాడుతున్న బాలికను కాపాడి హీరో అయిపోయాడో లోకల్ బాయ్. వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన హు యూవాన్చాన్ బిల్డింగ్ దగ్గర్లో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడే బాలిక బాల్కనీలో నుంచి వేలాడుతుండటం గమనించాడు. ఆరో అంతస్థులో ఉన్న చిన్నారిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. బిల్డింగ్ తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. 

అప్పుడే కిటికీలో నుంచి పైకి ఎక్కాలని అనుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి ఎక్కాడు. అదృష్టవశాత్తు ఏ గాయం లేకుండానే చిన్నారిని కాపాడాడు. ఒకవేళ కిందపడితే పట్టుకోవాలని స్థానికులు బెడ్ షీట్ తో సిద్ధంగా ఉన్నారు. అతను చేసిన సాహసోపేతమైన చర్యకు స్థానికులంతా రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ అంటూ పొగిడారు. 

మే 21న సౌత్ వెస్టరన్ చైనాలోని జింగాంగ్ ఈ ఘటన నమోదైనట్లు సిచువాన్ పోలీసులు తెలిపారు. బిల్డింగ్ లో ఒంటరిగా ఉన్న 10 సంవత్సరాల చిన్నారి అమ్మని వెతుక్కుంటూ గ్రిల్ ఎక్కేసింది. పట్టుకుదరకపోవడంతో జారిపోయింది. చివర పట్టుకుని వేలాడుతూ కాపాడమని అరుస్తూ ఉందని స్థానికులు చెబుతున్నారు. 

కాపాడిన వ్యక్తికి ప్రభుత్వం 6లక్షల యువాన్ లు ప్రభుత్వం ప్రకటించింది. ‘ఇటువంటి ప్రమాదకర ఘటనలో జరగాలనుకోవడం లేదు. కానీ సమాజానికి అవసరమైనప్పుడు చేయకతప్పదు. ప్రతి ఒక్క వ్యక్తి ముందుకొచ్చి సమాజం కోసం ముందుకురావాలి. గతేడాది కూడా బిల్డింగ్ పై నుంచి వేలాడుతూ ఉన్న ఇలాంటి ఘటనే ఒకటి జరిగి వైరల్ అయింది. 

ఆ సమయంలో స్థానికులంతా కలిసి చిన్నారిని పెద్ద దుప్పటిలో పట్టుకుని కాపాడారు. చిన్నపాటి గాయాలతో బయటపడింది ఆ చిన్నారి.