మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు

Submitted on 14 February 2020
Man In Karnataka Reportedly Ran 100m In 9.55 Sec In Muddy Field, That's Faster Than Usain Bolt!

ఉసేన్ బోల్ట్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పరుగుపోటీలో ఉసేన్ బోల్డ్ ను ఎవ్వరూ అధిగమించలేరన్న విషయం తెలిసిందే. ఉసేన్ బోల్డ్ ను దాటి పరుగెత్తాలంటే ఎవ్వరికైనా అంత ఈజీ కాదు. అయితే ఈ వరల్డ్ ఛాంపియన్ ని మనోడొకరు వెనక్కి నెట్టేశాడు. అయితే ఇక్కడ మరో విశేషం కూడా దాగి ఉంది.

కర్నాటక రాష్ట్రానికి చెందిన 28ఏళ్ల యువకుడు ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రి పట్టణానికి చెందిన శ్రీనివాస గౌడ(28) కంబాలా లేదా బఫెల్లో(దున్నపోతు) రేస్ లో పాల్గొని...బురదతో ఉన్న మైదానంలో కేవలం 13.62సెకన్లలో 142.5మీటర్లు పరుగెత్తాడు. కేవలం 9.55సెకన్లలోనే 100మీటర్లు పరుగెత్తి రికార్డ్ సృష్టించాడు శ్రీనివాస్.

అయితే వరల్డ్ రేస్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ కి 100మీటర్లు కవర్ చేయడానకి 9.58సెకన్లు పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను చెరిపివేశాడు శ్రీనివాస్. ఈ మేరకు కర్ణాటకకు చెందిన ఓ జర్నలిస్ట్ గురువారం(ఫిబ్రవరి-13,2020) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటకలో దున్నపోతులు ఇన్వాల్వ్ అయ్యే సాంప్రదాయ రేస్ ను కంబాలా రేస్ అని పిలుస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ,ఉడుపి జిల్లాల్లోని రైతుల కమ్యూనిటీ ప్రతి ఏటా ఈ కంబాలా రేస్ పోటీలను నిర్వహిస్తుంటారు.

అయితే శ్రీనివాస్ ఉసేన్ బోల్ట్ రికార్డు చెరిపివేశాడని చెప్పలేమని,శ్రీనివాస్-ఉసేన్ బోల్ట్ రికార్డులను పోల్చి చూడలేనివని కొందరు అంటున్నారు. శ్రీనివాస్ ఒక జత దున్నపోతులకున్న తాడుని పట్టుకుని వాటితో పరిగెత్తాడు కాబట్టి,ఆ వేగం అనేది దున్నపోతుల నుంచి జనరేట్ అయినదని అంటున్నారు. కానీ రేసు ఒక బురద మైదానంలో నడిచింది కాబట్టి శ్రీనివాస్ ది రాకార్డేనని మరికొందరంటున్నారు. పోలికలు లేకుండా కూడా, శ్రీనివాస్ గౌడ ఘనత చాలా గొప్పదే.

అయితే ఓవర్ నైట్ లో సెన్సేషన్ అయిన శ్రీనివాస్...అన్ని వైపుల నుంచి తనకు వస్తున్న అద్భుతమైన స్పందన చూసి ఆశ్చర్యం కలుగుతున్నట్లు చెప్పారు. శ్రీనివాస్ నమ్మశక్యం కానీ ఫీట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది శ్రీనివాస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. శ్రీనివాస్ గ్రేట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం శ్రీనివాస్ ను ఒలంపిక్స్ కోసం ట్రైన్ చేయాలని కోరుతున్నారు.

జంతు హక్కుల కార్యకర్తల ఒత్తిడితో కొన్నేళ్ల క్రితం కర్నాటకలో కంబాలా పోటీలపై నిషేధం కొనసాగింది. అయితే సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక చట్టం చేసి కంబాలా పోటీలకు అనుమతిచ్చారు.

	Usain.jpg

Read More >> చంద్రబాబుకు కేంద్రమంత్రి లేఖ,కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్

Srinivasa Gowda
Usain Bolt
karnataka
Muddy Field
Ran 100m
Faster
Moodabidri
Dakshina Kannada district
13.62 seconds

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు