మహేష్ మళ్ళీ ఎగరేసాడు

Submitted on 16 May 2019
Maharshi Team at SUdarshan 35 MM Theatre

సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ కాలర్ ఎగరేసాడు. మహేష్ నటించిన 25వ సినిమా మహర్షి అతని కెరీర్ ‌లనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గత ఆదివారం జరిగిన సక్సెస్ మీట్‌లో మహేష్ మాట్లాడుతూ : 'ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో వంశీ చెప్పాడు, సినిమా చూసాక నాన్నగారి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారని.. వాళ్ళే కాదు, నేనుకూడా కాలర్ ఎగరేస్తున్నా'.. అంటూ కాలర్ ఎగరేసాడు.. సినిమాని విజయవంతం చేసినందుకు ఫ్యాన్స్, ఆడియన్స్‌కి థ్యాంక్స్ చెప్పడానికి మూవీ యూనిట్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌కి వెళ్ళింది.

అక్కడ మహేష్ మాట్లాడుతూ.. 'నేను పార్టనర్ షిప్‌లో ఏఎంబీ సినిమాస్ స్టార్ట్ చేసాను కానీ, సుదర్శన్ నా సొంత థియేటర్.. ఇక్కడ మురారి సినిమా చూసాను, సినిమా అయిపోయాక నాన్నగారు నా భుజంమీద చెయ్యివేసారు.. మీ అందరికోసం మళ్ళీ ఇంకోసారి కాలర్ ఎగరేస్తున్నాను'.. అంటూ, కాలర్ ఎగరేసాడు మహేష్.

మహర్షి రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. యూఎస్‌లో 1.5 మిలియన్స్ క్రాస్ చేసి, 2 మిలియన్ క్లబ్‌కి చేరువలో ఉంది. సెలవులు కావడం, పైగా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర మహర్షి స్పీడ్ మరికొద్ది రోజుల పాటు కొనసాగనుంది. 
 

Maheshbabu
PoojaHegde
Devi Sri Prasad
Vamshi Paidipally

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు