టెంపోపైకి దూసుకెళ్లిన ట్రక్కు..13మంది మృతి

Submitted on 20 May 2019
Maharashtra 13 Killed, Three Injured in Truck Accident at NH 6

మహారాష్ట్రలో బుల్దానాలో  సోమవారం(మే-20,2019)ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు టెంపోపైకి దూసుకొచ్చిన ఘటనలో 13 మంది అక్కడిక్కడే మృతి చెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. 
మల్కాపూర్‌ నుంచి అనురాబాద్‌ వెళ్లేందుకు కొంతమంది వ్యక్తులు టెంపోలో బయల్దేరారు. అదే సమయంలో ఉప్పు లోడుతో కచ్ నుంచి నాగ్ పూర్ వైపుకి ఎన్ హెచ్ 6పై వస్తున్న ఓ ట్రక్కు టైర్‌ పేలిపోయింది. అయితే ట్రక్కు అధిక వేగంతో ప్రయాణిస్తున్న కారణంగా పల్టీలు కొట్టి ఎదురుగా వస్తున్న టెంపోపై పడింది. దీంతో టెంపో నుజ్జనుజ్జయింది.

ఈ ఘటనలో 13మంది అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్‌ చేయడంతో పాటుగా పోలీసులకు సమాచారం అందించారు. ట్రక్కు కింద ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో జేసీబీని తీసుకువచ్చి టెంపోపై నుంచి ట్రక్కును తొలగించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

maharastra
killed
Truck
tempo
same family
people
Buldana
sp
Accident

మరిన్ని వార్తలు