మళ్లీ మొదలెట్టండీ : టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేత

Submitted on 24 April 2019
Madras High Court lifts ban on TikTok video app

టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్టు. గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్ పై పూర్తి విచారణ చేసి.. తుది నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు నుంచి మళ్లీ మద్రాస్ హైకోర్టుకే వచ్చింది కేసు. 2019, ఏప్రిల్ 24వ తేదీన వాదనలు విన్న న్యాయస్థానం.. టిక్ టాక్ యాప్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది.

అయితే అశ్లీలం, అసభ్యకరమైన వీడియోలు అప్ లోడ్ కాకుండా చూడాలని, లేనిపక్షంలో మళ్లీ చర్యలు తీసుకుంటాం అంటూ వార్నింగ్ ఇచ్చింది కంపెనీకి. దేశ భద్రత, అశ్లీల వీడియోలు యాప్ లోకి అప్ లోడ్ కాకుండా.. కంపెనీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఇన్వెస్టర్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ కోర్టుకి వివరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించం అని.. 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించకుండా కొత్త చర్యలు చేపడతాం అని చెప్పటంతో మద్రాస్ హైకోర్టు బ్యాన్ సడలించింది.

గతంలో ఈ యాప్ పై మద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో తమ ప్లే స్టోర్ల నుంచి యాప్ ను తొలగించాయి గూగుల్, యాపిల్. నిషేధం ఎత్తివేయటంతో.. ఇక నుంచి ఈ యాప్ ను హ్యాపీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
Also Read : రియల్ టైమ్ Pitstop యాప్ : మీ కారులో ట్రబులా? చిటికెలో పరిష్కారం

madras high court
lifts ban
TikTok video app

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు