కిక్కే కిక్కు.. మహిళల కోసం మద్యం షాపులు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

Submitted on 28 February 2020
Madhya Pradesh To Set Women-Friendly Liquor Shops To Make Women Happy

మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇకపై మద్యం కొనేందుకు మహిళలు ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఎంచక్కా వారికి కావాల్సిన బ్రాండ్ ను కొనుక్కోవచ్చు. ఈ దిశగా కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు ఏర్పాటు చేయనుంది. త్వరలో ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం కొనేందుకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేకంగా లేడీస్ కోసం ఏర్పాటు చేసే ఈ లిక్కర్ షాపుల్లో హై ఎండ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారట.

మహిళల సౌకర్యం కోసం:
ముందుగా భోపాల్, ఇండోర్ లో ఎక్స్ క్ల్యూజివ్ గా రెండు లిక్కర్ షాపులు.. జబల్ పూర్, గ్వాలియర్ లో చెరో లిక్కర్ షాప్ ఏర్పాటు చేయనున్నారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే వైన్, విస్కీ బ్రాండ్లను ఈ షాపుల్లో విక్రయించనున్నారు. ఈ లిక్కర్ షాపుల్లో నాణ్యమైన మద్యం మాత్రమే అమ్ముతారు. మద్యం కొనుగోలు చేసే విషయంలో మహిళలకు సౌకర్యవంతంగా ఉండేలా.. మాల్స్ లో ఈ ప్రత్యేక లిక్కర్ షాపులు అధికారులు ఏర్పాటు చేయనున్నారు. 

టార్గెట్ రూ.2వేల కోట్ల ఆదాయం:
మద్యం అమ్మకాల ద్వారా వీలైనంత ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తోంది. అంతేకాదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా 15 వైన్ షాపులు ఓపెన్ చేయనుంది కమల్ నాథ్ సర్కార్. ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.2వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యప్రదేశ్ లో 2వేల 544 స్వదేశీ తయారీ లిక్కర్ షాపులు, 1,061 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ షాపులు ఉన్నాయి. దేశంలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కర్నాటక ఉంది. 

* ఓన్లీ ఫర్ లేడీస్.. మద్యం షాపులు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
* ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులు
* మహిళల సౌకర్యం కోసం ప్రత్యేక లిక్కర్ షాపులు
* ప్రత్యేక ఔట్ లెట్లలో మహిళలు ఎక్కువగా ఇష్టపడే వైన్, విస్కీ బ్రాండ్ లిక్కర్ అమ్మకాలు
* భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్ పూర్ లో వైన్ ఫెస్టివల్ నిర్వహించనున్న ప్రభుత్వం

* పర్యాటక ప్రాంతాల్లో 15 వైన్ షాపులు తెరవనున్న ప్రభుత్వం. ద్రాక్షతో చేసిన వైన్ అమ్మకం
* 2020 ఏప్రిల్ 1 నుంచి మధ్యప్రదేశ్ లో 15శాతం పెరగనున్న మద్యం ధరలు
* ఎక్సైజ్ శాఖ నుంచి అదనంగా రూ.2వేల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం
 

Madhya Pradesh
 Women Friendly Liquor Shops
Women Happy
cm kamalnath
foreing liquor
sales
only ladies
malls
BRANDS
whisky
Wine

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు