మేడ్ ఇన్ చైనా - ట్రైలర్

Submitted on 18 September 2019
Made In China Official Trailer

రాజ్ కుమార్ రావ్, మౌనీ రాయ్ జంటగా, మాడాక్ ఫిలింస్, జియో స్టూడియోస్ బ్యానర్స్‌పై దినేష్ విజాన్, శారదా కర్కీ జలోటా కలిసి నిర్మిస్తున్న సినిమా 'మేడ్ ఇన్ చైనా'.. 'రాంగ్ సైడ్ రాజు' ఫేమ్ మిఖిల్ ముసాలే డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పరేష్ రావెల్, రాజ్ కుమార్ రావ్‌కు బిజినెస్ టిప్స్ చెప్పడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

బిజినెస్‌లో ఎదగడానికి రాజ్ కుమార్ రావ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చూపించడంతో సినిమా స్టోరీ లైన్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది. రఘు అనే స్ట్రగ్లింగ్ బిజినెస్ మెన్‌గా రాజ్ కుమార్ రావ్, సెక్సాలజిస్ట్ డాక్టర్ వర్థిగా బొమన్ ఇరానీ కనిపించారు.

నేపాలీ హ్యాండీక్రాఫ్ట్ డీలర్ చైనా వెళ్లి మిలీయనీర్‌గా ఎలా డెవలప్ అయ్యాడు అనే పాయింట్‌తో, కామెడీ అండ్ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'మేడ్ ఇన్ చైనా' ఈ దివాళీకి రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : అంజూ రాకేష్ ధావన్, ఎడిటింగ్ : మానన్ అశ్విన్ మెహతా, మ్యూజిక్ : సచిన్ - జిగార్.  

Made In China Official Trailer

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు