హైదరాబాద్‌లో రూ.5కోట్ల ప్యాకేజితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం

Submitted on 23 October 2019
LPU engineering student Tanya bags Rs42L job

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) చివరి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థినికి తాన్య అరోరాను మైక్రోసాఫ్ట్ రూ.42లక్షలు(ఏడాదికి రూ.5.04కోట్లు) పే ప్యాకేజీతో ఎంపిక చేసుకుంది.

ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ఫ్రెషర్లు అందుకున్న ఉద్యోగ ఆఫర్లలో ఇదే బెస్ట్. ఉద్యోగంలో చేరాక తాన్యా హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేయనుంది.

తాన్యాకు ఇంత ప్యాకేజ్‌తో ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వ విద్యాలయం చాన్స్‌లర్‌ అశోక్‌ మిట్టల్‌ వ్యాఖ్యానించారు.  తాన్యాను చూస్తుంటే గర్వంగా ఉందని, గత మూడేళ్లుగా ఎల్‌పీయూ విద్యార్ధులు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు సాధిస్తున్నట్లు వెల్లడించారు.

ఫార్చ్యూన్‌- 500 కంపెనీల జాబితాలో ఉన్న హెచ్‌పీ, అమెజాన్, యాహూ, సిస్కో, ఆపిల్, గూగుల్‌ తదితరల దిగ్గజ సంస్థల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు ఆయన తెలిపారు. 
 

LPU engineering
student Tanya
Rs42L job
5CRORE

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు